భువనగిరి కలెక్టరేట్, జూలై 17 : గొర్రెలు, మేకల కొనుగోళ్లలో నగదు బదిలీ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని గ్రొరెల మేకల పెంపకందారుల సంఘం భువనగిరి మండల కార్యదర్శి, గోపాలకృష్ణ సంఘం గ్రామ అధ్యక్షుడు పాక జహంగీర్ యాదవ్ ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని గౌస్‌నగర్ గ్రామంలో గ్రొరెల కాపరులతో కలిసి జిల్లా మహాసభల వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. రాయగిరిలోని లింగ బసవ గార్డెన్లో ఈ నెల 22, 23 తేదీల్లో నిర్వహించే మూడవ జిల్లా మహా సభలను జయప్రదం చేయాలని కోరారు.
గత 8 నెలలుగా పశు వైద్యశాలలకు మందుల సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. రెండో విడుత నగదు బదిలీ అమలు చేయాలన్నారు. ప్రమాదాలు, పకృతి వైపరీత్యాలు, రోగాలు, కుక్కల దాడిలో చనిపోయిన గ్రొరెలకు రూ.10 వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని, అలాగే కాపారులకు ఉచిత బీమా రూ.10 లక్షలకు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు గొర్ల రాములు, పాక యాదయ్య, గొర్ల ఐల్లయ్య, పాక కిష్టయ్య, కొమ్ము భీమయ్య, పాక పర్వతాలు, భూషబోయిన నరేందర్, గొర్ల మహేందర్, పాక శ్రీకాంత్, పాక రాజు పాల్గొన్నారు.