కుమమొటొ : బీడబ్ల్యూఎఫ్ కుమమొటొ సూపర్ 500 (జపాన్ ఓపెన్) టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ ప్రిక్వార్టర్స్‌కు చేరారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 15వ ర్యాంకర్ అయిన సేన్.. 21-12, 21-16తో జపాన్‌కే చెందిన కొకీ వతనబెను ఓడించాడు. 39 నిమిషాల్లోనే ముగిసిన పోరులో ఏడో సీడ్ భారత కుర్రాడు.. ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన లేకుండానే ముందంజ వేశాడు.
మరో మ్యాచ్‌లో ప్రణయ్.. 16-21, 21-13, 23-21తో లియోంగ్ జున్ హవొ (మలేషియా)పై హోరాహోరీ పోరులో ఉత్కంఠ విజయం సాధించి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాడు. అయితే మిగిలిన మ్యాచుల్లో కిరణ్ జార్జి, అయూశ్ శెట్టితో పాటు మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్-రిత్విక్ జోడీ తమ ప్రత్యర్థుల చేతుల్లో ఓటమిపాలై తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టారు.