Hong Kong Open : హాంకాంగ్ ఓపెన్‌లో భారత స్టార్లు టైటిల్ వేటలో తడబడ్డారు. లీగ్ ఆసాంతం దుమ్మురేపిన లక్ష్య సేన్(Lakshya Sen) ఫైనల్లో మాత్రం తేలిపోయాడు. వరుస సెట్లలో జోరు చూపించిన లీ షీ ఫెంగ్(చైనా) చేతిలో సేన్ కంగుతిన్నాడు. దాంతో.. మూడేళ్ల తర్వాత 500 సూపర్ టోర్నీ ఫైనల్ చేరిన అతడు రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. మరోవైపు.. పురుషుల డబుల్స్‌లోనూ సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టికి చుక్కెదురైంది. ఈ స్టార్ ద్వయం ఫైనల్లో ఓటమి పాలైంది.
సెమీఫైనల్లో ఆరో ర్యాంకర్‌కు షాకిచ్చిన లక్ష్య సేన్ ఫైనల్లో టాప్ గేర్‌లో ఆడలేకపోయాడు. ఆరంభంలో దూకుడు కనబరిచి సుదీర్ఘ ర్యాలీలతో లీ షీ ఫెంగ్‌ను తిప్పలు పెట్టిన సేన్ 9 పాయింట్లు సాధించాడు. అయితే.. ఆ తర్వాత అతడు అదే ఊపు కొనసాగించలేకపోయాడు. దాంతో.. పుంజుకున్న చైనా షట్లర్ వరుసగా స్మాష్‌లతో భారత స్టార్‌కు షాకిచ్చాడు. తొలి సెట్‌ను గెలుచుకున్న ఫెంగ్‌ను సేన్ రెండో సెట్లో నిలువరించే ప్రయత్నం చేశాడు. కానీ. ఒకదశలో 4-4తో స్కోర్లు సమం అయ్యాయి. కానీ, సేన్‌పై ఒత్తిడి పెంచిన చైనా ప్లేయర్ అలవోకగా మ్యాచ్ గెలుపొందాడు.
Satwik-Chirag finish Hong Kong Open 2025 as Runners-Up! 🥈👏
India’s Satwiksairaj Rankireddy and Chirag Shetty finished on the podium for the first time this year on #BWFWorldTour, going down fighting 21-19, 14-21, 17-21 to Paris 2024 silver medallists Liang Weikeng & Wang… pic.twitter.com/j8WJlagHID
— Olympic Khel (@OlympicKhel) September 14, 2025
ఈ సీజన్లో అదరగొడుతూ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన సాత్విక్ చిరాగ్ జోడీ సైతం హాంకాంగ్ ఓపెన్ ఫైనల్లో పోరాడి ఓడింది. టైటిలో పోరులో లియాంగ్ వీ కెంగ్ – వాంగ్ ఛాంగ్(చైనా) ధాటికి తొలి సెట్ ఓడిన భారత ద్వయం.. రెండో సెట్లో సత్తా చాటి ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. అయితే.. భారత ఆటగాళ్ల గేమ్ ప్లాన్‌ను పసిగట్టిన వాంగ్ ఛాగ్ నెట్ వద్ద చురుకుగా కదులుతూ పాయింట్లు రాబట్టాడు. దాంతో.. సాత్విక్, చిరాగ్‌లు మూడు సెట్ల మ్యాచ్‌ను 19-21, 21-14, 21-17తో చేజార్చుకున్నారు.