బూస్టో అర్సిజియో(ఇటలీ): వరల్డ్ ఒలింపిక్ బాక్సింగ్ క్వాలిఫయర్ టోర్నీలో భారత బాక్సర్ల పేలవ ప్రదర్శన కొనసాగుతున్నది. జాతీయ చాంపియన్ లక్ష్య చాహర్ తన తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. మంగళవారం జరిగిన పురుషుల 80కిలోల విభాగం మొదటి పోరులో లక్ష్య చాహర్..గెశ్లాగీ మేసమ్(ఇరాన్) చేతిలో నాకౌట్ అయ్యాడు.
తొలి రౌండ్‌ను 2-3తో చేజార్చుకున్న లక్ష్య..మలిరౌండ్లో పుంజుకుని పోటీలోకి వచ్చాడు. ఓవైపు పదునైన పంచ్‌లు, హుక్స్, జాబ్స్‌తో ముప్పేట దాడికి పాల్పడి రెండో రౌండ్లో 3-2 ఆధిక్యం ప్రదర్శించాడు.