అడిలైడ్: ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్(Labuschagne).. అడిలైడ్ టెస్టులో హాఫ్ సెంచరీ చేశాడు. భారత బౌలర్ బుమ్రాను ధీటుగా ఎదుర్కొన్న ఆ బ్యాటర్.. చాలా ఓపికగా తన ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. టెస్టుల్లో అతను 21వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 114 బంతుల్లో అతను ఆ అర్థశతకాన్ని పూర్తి చేశాడు. పెర్త్‌లో విఫలమైన లబుషేన్.. అడిలైడ్‌లో సహనాన్ని ప్రదర్శించాడు. మెక్‌స్వీనే, లబుషేన్ మధ్య రెండో వికెట్‌కు 67 రన్స్ జోడించారు. కానీ దాదాపు 26 ఓవర్ల పాటు వికెట్ పడకుండా ఆ బ్యాటర్లు అడ్డుకున్నారు.
109 బంతుల్లో 37 రన్స్ చేసిన మెక్‌స్వీనే .. బుమ్రా బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన స్మిత్ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. రెండు పరుగులు చేసిన అతను బుమ్రా బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 54 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 168 రన్స్ చేసింది. లబుషేన్ 64 రన్స్ చేసి ఔటయ్యాడు. ట్రావిస్ హెడ్ 32 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. మూడు వికెట్లూ బుమ్రా ఖాతాలో పడ్డాయి.