ISSF Shotgun World Cup : ఐఎస్ఎస్ఎఫ్ షాట్‌గన్ వరల్డ్ కప్‌లో భారత షూటర్లు సత్తా చాటారు. కినన్ చెనాయ్ (Kynan Chenai), సబీరా హ్యారిస్ (Sabeera Haris)లు పతకంతో మెరిశారు. ఆదివారం జరిగిన మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో అదరగొట్టి కంచు మోతో మోగించారు. మూడో స్థానం కోసం తుర్కియే షూటర్లతో పోటీ పడిన ఈ జోడీ అద్భుత ప్రదర్శనతో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. క్వాలిఫికేషన్ రౌండ్లో 34వ స్థానంలో నిలిచిన భారత ద్వయం.. అసమాన ప్రతిభాపాటవాలతో పతకం కొల్లగొట్టడం విశేషం.
నికోసియా వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ షాట్‌గన్ వరల్డ్ కప్ మిక్సడ్ పోటీల క్వాలిఫికేషన్లో నిరాశపరిచిన కినన్, సబీరలు ఆ తర్వాత పుంజుకున్నారు. టీమ్ విభాగంలో 142 పాయింట్లు సాధించి 34వ స్థానం సాధించారు.
🚨#News l First World Cup medal 🥉of the year for India in Shotgun 🇮🇳
Indian duo of Kynan Chenai and Sabeera Haris secured the bronze medal in the Mixed Trap event at the Nicosia Shotgun World Cup🏆
They hit 34/50 hits to edge past Turkiye (33) in the bronze medal match.#ISSF… pic.twitter.com/tfJtriu5IT
— The Bridge (@the_bridge_in) May 11, 2025
మూడో స్థానం కోసం తుర్కియే ద్వయం తొల్గా టన్సర్, పెలిన్ కయాపై 34-33తో విజయం సాధించారు. అగ్రస్థానంలో నిలిచిన చైనా బంగారు పతకం గెలవగా.. పొలాండ్ షూటర్లు సిల్వర్ సాధించారు. భారత్‌కు చెందిన శార్దూల్ విమాన్, కిర్తీ గుప్తాలు 137 పాయింట్లతో 17వ స్థానంలో నిలిచారు.