NIMS | ఖైరతాబాద్, మే 11 : నిమ్స్ దవాఖానలో ఉన్న తన తల్లిని చూసేందుకు వచ్చిన ఓ వ్యక్తి కనిపించకుండా పోయాడు. పంజాగుట్ట పోలీసలు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జల్లాకు చెందిన ఎండి అహ్మద్ పాషా ఈ నెల 9న నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న తన తల్లిని చూసేందుకు వచ్చాడు. మధ్యాహ్నం భోజనం చేసి తిరిగి వస్తానంటూ చెప్పి వెళ్లాడు. సాయంత్రం వరకు కూడా తిరిగి రాలేదు. వెంటనే ఫోన్ చేయగా, తాను ఎక్కడ ఉన్నది స్పష్టంగా చెప్పలేకపోయాడు. మరికొద్ది సేపటికి వేరే వ్యక్తి ఫోన్లో మాట్లాడుతూ తాను శ్రీనగర్‌కాలనీలోని సాయిబాబా గుడిలో ఉన్నట్లు చెప్పాడు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకోగా, కనిపించలేదు. మరో సారి ఫోన్ చేయగా స్పందించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాధితుడి మానసిక స్థితి సరిగా లేదని, కళ్లు తాగే అలవాటు ఉందని కుటుంబ సభ్యులు పోలీసుల దృష్టికి తెచ్చారు.