ODI World Cup 2023 : వరల్డ్ కప్ టోర్నీని విజయంతో ఆరంభించిన 2019 రన్నరప్ న్యూజిలాండ్‌ను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే బొటనవేలి గాయం కారణంగా కెప్టెన్ కేన్ విలియమ్సన్ బెంచ్‌కే పరిమితం కాగా.. బుధవారం దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో స్టార్ పేసర్ మ్యాట్ హెన్రీ(Matt Henry) గాయపడ్డాడు.
హార్మ్‌స్ట్రింగ్ ఇంజూరీ బారిన పడిన అతను కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్ ఉన్నందున కివీస్ క్రికెట్ బోర్డు ఆల్‌రౌండర్ కైలీ జేమీసన్(kyle jamieson)ను బ్యాకప్ బౌలర్‌గా తీసుకుంది. కుడి చేతివాటం పేసర్ జేమీసన్ గురువారం బెంగళూరుకు చేరుకుంటాడని హెడ్‌కోచ్ గ్యారీ స్టీడ్ తెలిపాడు.
కైలీ జేమీసన్
వరుసగా భారత్, సఫారీ జట్టు చేతిలో ఓటములతో సెమీస్ రేసులో కాసింత వెనకబడిన కివీస్.. పాక్‌తో నవంబర్ 2న జరిగే మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. బంగ్లాదేశ్‌పై ఓదార్పు విజయంతో సెమీస్ రేసులో నిలిచిన బాబర్ సేనకు కూడా ఈ మ్యాచ్ కీలకం కానుంది.