Keedaa Cola | పెళ్లి చూపులు (Pelli Choopulu), ఈ నగరానికి ఏమైంది (ENE) చిత్రాల ఫేమ్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) స్వీయ దర్శకత్వంతో వస్తున్న తాజా చిత్రం ‘కీడా కోలా’ (Keedaa Cola). బ్రహ్మనందం, చైతన్య రావు, రాగ్ మయుర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సరికొత్త క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ దగ్గుబాటి రానా సమర్పణలో నవంబర్ 03న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్లను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమా రేపు విడుదల కానుండగా తరుణ్ భాస్కర్ ఒక ఫన్నీ వీడియో విడుదల చేశారు.
‘కీడా కోలా’ ప్రమోషన్స్‌లో భాగంగా.. బ్రహ్మనందం నటించిన మూవీల నుంచి ఫన్నీ మీమ్ టెంప్లెంట్స్ తీసుకునీ వాటిని తరుణ్ రీ క్రియేట్ చేశాడు. స్లో మోషన్లా బుల్లెట్స్ వెళ్లాలి.. వివేక్ సాగర్ మ్యూజిక్‌తో ర్యాంప్ ఆడించలే.. ఐ నో ద పబ్లిక్ పల్స్ రా(నేనింతే మూవీ), ఒరేయ్ చారి ఈ ఫీలింగ్ ఏంట్రా (అదుర్స్), మై ఫ్రెండ్స్ లివింగ్ లెజెండ్స్ (దుబాయ్ శీను) అంటూ బ్రహ్మనందం నటించిన పాత్రలలో తరుణ్ నటించి ఒక వీడియో విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇది చూసిన నెటిజన్లు తరుణ్ సినిమాలతోనే కాకుండా ప్రమోషన్స్‌తో కూడా నవ్విస్తాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
😂😂😂😂 idhi highlight aslu pic.twitter.com/GQ6SMcm44P
— udd_pran🤝 (@UduthalaPranay) November 1, 2023
క్రైం కామెడీ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమాను వీజీ సైన్మా బ్యానర్‌పై కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మిస్తుండగా.. బ్రహ్మానందం, చైతన్యరావు, తరుణ్‌భాస్కర్, రాగ్‌మయూర్, రఘురామ్, రవీంద్ర విజయ్, జీవన్ కుమార్, విష్ణు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 3న థియేటర్లలో సందడి చేయనుంది.