Jagapathi babu | టాలీవుడ్ ప్రేక్షకులతోపాటు వరల్డ్‌వైడ్‌గా ఉన్న పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమాల్లో టాప్‌లో ఉంటుంది ‘సలార్’ (Salaar). ప్రభాస్ టైటిల్ రోల్లో నటిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్లో గూస్బంప్స్ తెప్పించే విజువల్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్ట్ చేస్తున్న సలార్ రెండుపార్టులుగా రాబోతుండగా.. Salaar Part-1 Ceasefireను డిసెంబర్ 22 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో జగపతిబాబు రాజమన్నార్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ విడుదల దగ్గరపడుతున్న నేపథ్యంలో సలార్‌పై సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు.
ఈ మూవీ విడుదల అయ్యాక ”సలార్‌తో పై మెట్టు ఎక్కబోతున్నాను” అంటూ జగపతిబాబు ట్విట్ చేశాడు. దీంతో ఈ మూవీలో జగ్గుభాయ్ రోల్ ఎంత క్రూరంగా ఉంటుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
#Salaar tho pai mettu ekkabothunanu. pic.twitter.com/TjxQ45eaFC
— Jaggu Bhai (@IamJagguBhai) November 2, 2023
సలార్ చిత్రంలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కీలక పాత్రలో నటిస్తున్నాడు. సలార్‌లో పృథ్విరాజ్ సుకుమార్ పోషిస్తున్న వరదరాజ మన్నార్ ది కింగ్ లుక్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ తెరకెక్కిస్తున్న సలార్ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో డిసెంబర్ 22 గ్రాండ్‌గా విడుదల కానుంది.