వెస్టిండీస్‌తో భారత్ ఆడే మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జట్టులో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కడం చాలా సంతోషకరమని భారత జట్టు మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అభిప్రాయపడ్డాడు.
2017-19 మధ్య భారత వన్డే జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న కుల్దీప్.. ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయాడు. ఈ క్రమంలో మళ్లీ విండీస్ సిరీస్‌కు కుల్దీప్తోపాటు ఐపీఎల్ స్టార్ రవి బిష్ణోయికి సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. ఈ ఎంపికను భరత్ అరుణ్ ప్రశంసించాడు.
మణికట్టు స్పిన్నర్లు పరిమిత ఓవర్ల క్రికెట్లో మరుగున పడుతున్నారని, కానీ మంచి అవకాశాలు ఇవ్వడం ద్వారా వాళ్లు పరిణితి సాధించే అవకాశం ఉందని ఆయన అన్నారు. అలాగే కుల్దీప్లో చాలా సత్తా ఉందని, అతను భవిష్యత్తులో భారత్‌కు చాలా మంచి అంశంగా మారతాడని కొనియాడాడు.
అతను మళ్లీ భారత జట్టులో కలవడం చాలా మంచి విషయమని ప్రశంసించాడు. ఫిబ్రవరి 6 నుంచి భారత్-వెస్టిండీస్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో రెండు జట్లు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడతాయి.