Kuldeep Yadav : ఆసియా కప్‌లో వికెట్ల వేట కొనసాగించిన భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) టెస్టుల్లోనూ చెలరేగిపోతున్నాడు. ఢిల్లీ టెస్టులో తిప్పేసిన ఈ చైనామన్ బౌలర్ వెస్టిండీస్ నడ్డివిరిచాడు. చివరి బ్యాటర్ జైడెన్ సీల్స్()ను ఔట్ చేసి ఐదో వికెట్ సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఐదోసారి ఈ ఫీట్ సాధించిన కుల్దీప్ చరిత్ర సృష్టించాడు. తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే ఐదు పర్యాయాలు 5 వికెట్ల ప్రదర్శన చేసిన ఎడమచేతివాటం స్పిన్నర్‌గా రికార్డు నెలకొల్పాడీ లెగ్గీ.
కుల్దీప్ జోరుతో ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ జానీ వార్డ్లే(Johnny Wardle) రెండో స్థానానికి పడిపోయాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన వార్డ్లే 28 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకోగా.. కుల్దీప్ కేవలం 15 ఇన్నింగ్స్‌ల్లోనే ఐదో ఐదు వికెట్ల ప్రదర్శన కనబరచడం విశేషం. 45 ఇన్నింగ్స్‌లు తీసుకున్న దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్ పాల్ ఆడమ్స్(Paul Adams) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
5⃣-fer x 5⃣ times
Kuldeep Yadav gets his fifth five-wicket haul in Tests! 👏
A wonderful performance from him yet again 🔝
Updates ▶ https://t.co/GYLslRzj4G#TeamIndia | #INDvWI | @IDFCFIRSTBank | @imkuldeep18 pic.twitter.com/BUhPgnIVt6
— BCCI (@BCCI) October 12, 2025
తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో గెలుపొందిన భారత జట్టు సిరీస్ క్లీన్‌స్వీప్ దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసిన టీమిండియా.. అనంతరం కుల్దీప్ యాదవ్ తిప్పేయగా విండీస్ 248కు కుప్పకూలి ఫాలో ఆన్ ఆడింది. ఓవర్‌నైట్ స్కోర్ 140/4తో మూడో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన కరీబియన్ జట్టును కుల్దీప్ యాదవ్ (5-82) దెబ్బకొట్టాడు. క్రీజులో పాతుకుపోయిన టెవిన్ ఇమ్లాచ్(21) ఎల్బీగా వెనక్కి పంపిన ఈ చైనామన్ బౌలర్.. గ్రేవ్స్‌ను పెవిలియన్ చేర్చాడు.
Make that 2⃣ wickets in 2⃣ overs for Kuldeep Yadav! 👏
He traps Tevin Imlach LBW! ☝️
Updates ▶ https://t.co/GYLslRzj4G#TeamIndia | #INDvWI | @IDFCFIRSTBank | @imkuldeep18 pic.twitter.com/YDUcNLS56m
— BCCI (@BCCI) October 12, 2025
ఖారీ పీయెర్రీ(23)ని బుమ్రా బౌల్డ్ చేయగా.. అండర్సన్ ఫిలిప్(24 నాటౌట్), జైడన్ సీల్స్ (13) కాసేపు ప్రతిఘటించారు. అయితే.. సీల్స్‌ను ఎల్బీగా ఔట్ చేసి ఐదో వికెట్ సాధించిన కుల్దీప్ స్టిండీస్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. దాంతో.. రోస్టన్ ఛేజ్ బృందం ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సరికి 173 పరుగులు చేసింది. ఇంకా 97 పరుగులు వెనుకంజలో ఉన్న విండీస్ నాలుగో రోజు ఎంతసేపు పోరాడుతుందో చూడాలి.