Vizag ODI : భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(2-38) వైజాగ్ వన్డేలో తిప్పేస్తున్నాడు. రాంచీలో ఒకేఓవర్లో రెండు వికెట్లు తీసిన ఈ చైనామన్ బౌలర్ విశాఖలోనూ తన స్పిన్ మ్యాజిక్ చూపించాడు. డెత్ ఓవర్లో గేర్ మార్చి ఆడాలనకున్న డేంజరస్ డెవాల్డ్ బ్రెవిస్(29), మార్కో యాన్సెస్(17)లను ఒకే ఓవర్లో ఔట్ చేసి సఫారీల భారీ స్కోర్ ఆశలపై నీళ్లు చల్లాడు. కుల్దీప్ ఇచ్చిన షాక్‌తో 235 వద్ద దక్షిణాఫ్రికా ఏడో వికెట్ కోల్పోయింది. 40 ఓవర్లకు సఫారీ టీమ్ స్కోర్.. 244-7.
సిరీస్ విజేతను నిర్ణయించే వైజాగ్ వన్డేలో ప్రసిధ్ కృష్ణ(3-52)కు జతగా కుల్దీప్ యాదవ్(2-38) సఫారీలను దెబ్బకొడుతున్నాడు. 39వ ఓవర్లో బంతి అందుకున్న కుల్దీప్ మొదటి బంతికే డెవాల్డ్ బ్రెవిస్(29)ను ఔట్ చేశాడు. రోహిత్ క్యాచ్ అందుకోవడంతో జూనియర్ డివిలియర్స్ వెనుదిరిగాడు. ఆ తర్వాత మూడో బంతికే చిచ్చరపిడుగు మార్కో యాన్సెన్(17) పెద్ద షాట్‌కు యత్నించి బౌండరీ వద్ద జడేజా చేతికి చిక్కాడు. దాంతో.. ఒక్క పరుగు తేడాతో రెండు బిగ్ వికెట్లు పడ్డాయి. ప్రస్తుతం కార్బిన్ బాష్(4 నాటౌట్), కేశవ్ మహరాజ్(4 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
Dewald Brevis ✅
Marco Jansen ✅Two in an over for Kuldeep Yadav!
South Africa 7⃣ Down
Updates ▶️ https://t.co/HM6zm9o7bm#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/aQTLqgmGVb
— BCCI (@BCCI) December 6, 2025