హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : పారిస్ పారాలింపిక్స్ మహిళల 400 మీటర్ల టీ20 పరుగు పందెంలో కాంస్యం సాధించిన జివాంజీ దీప్తిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణకు చెందిన దీప్తి అసమాన ప్రతిభతో రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా నిలిచావు అని ఆయన ఎక్స్ వేదికగా కొనియాడారు. ‘ఆడపిల్లలు తమ అసమానమైన శక్తి సామర్థ్యాలతో ఎంతటి ఆనందాన్ని తల్లితండ్రులకు ఇస్తారో ఆడపిల్ల తండ్రిగా నాకు తెలుసు. ఎన్ని కష్టాలున్నా సరే దీప్తి తల్లితండ్రులు మాత్రం ఆమె మీద నమ్మకం ఉంచటం గొప్ప విషయం. తల్లితండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ దీప్తి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది’ అని ఆయన పేర్కొన్నారు.