ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ 2021 ఫైనల్లో రజతం సాధించిన తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్‌కు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ సోమవారం ట్విట్టర్ ద్వారా శ్రీకాంత్‌ను ప్రశంసిస్తూ ఒక ట్వీట్ చేశారు.
“ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో అద్భుత ఆటతీరుతో భారత్‌కు రజత పతకం సాధించిన శ్రీకాంత్‌కు నా అభినందనలు” అని కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్లో రాశారు.
Commendable performance 👏 by ace shuttler @srikidambi winning historic silver in BWF World Championship 2021
— KTR (@KTRTRS) December 20, 2021
My compliments and all the best in keeping the national flag 🇮🇳 flying high 👍
కిడాంబి శ్రీకాంత్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ లాంటి మెగా టోర్నీలో రజతం సాధించిన తొలి భారతీయ పురుష షట్లర్‌గా రికార్డులకెక్కాడు. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన టైటిల్ పోరులో శ్రీకాంత్ సింగపూర్ ఆటగాడు లో కీన్‌యూ చేతిలో 21-15, 22-20 తేడాతో ఓటమి పాలయ్యాడు. ఫలితంగా రజత పతకంతో సరిపెట్టుకున్నాడు.
సింగపూర్‌కు చెందిన యువ బ్యాడ్మింటన్ సంచలనం.. లోకీన్ యు. అనామకుడిగా బరిలోకి దిగి.. ఏకంగా వరల్డ్ చాంపియన్‌గా నిలవడం విశేషం.