హైదరాబాద్, నవంబర్ 5(నమస్తే తెలంగాణ): జాతీయ స్థాయి 18 టోర్నీల్లో పోటీపడి పతకాలు సాధించిన హైదరాబాద్ యువ కరాటే ప్లేయర్ సబా మాహిన్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ప్రత్యేకంగా అభినందించారు. హైదరాబాద్ కిషన్‌బాగ్‌కు చెందిన మాహిన్ పలు టోర్నీల్లో పసిడి పతకాలతో సత్తాచాటింది.
ఈ సందర్భంగా మాహిన్ను సన్మానించిన కేటీఆర్..భవిష్యత్‌లో ఒలింపిక్స్‌లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షించారు. డిసెంబర్లో దుబాయ్ వేదికగా జరుగనున్న అంతర్జాతీయ టోర్నీలో పోటీపడేందుకు మాహిన్కు అవసరమైన ఆర్థిక సాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కేటీఆర్‌ను కలువడం చాలా సంతోషంగా ఉందని మాహిన్ పేర్కొంది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, సాట్స్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.