హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత పారా త్రోబాల్ జట్టు కెప్టెన్, మేడ్చెల్‌కు చెందిన డి. మహేశ్ నాయక్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. ఇటీవలే శ్రీలంకలో ముగిసిన తొలి సౌత్ఏషియా చాంపియన్‌షిప్‌లో భారత పారా త్రోబాల్ జట్టుకు సారథిగా వ్యవహరించిన మహేశ్.. దేశానికి రజతం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.
గ్రూప్ దశలో బంగ్లాదేశ్, నేపాల్, ఇండోనేషియా, పాకిస్థాన్‌ను ఓడించిన భారత్.. ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడి రజతం గెలుచుకుంది. ఈ సందర్భంగా గురువారం నందినగర్‌లోని తన ఇంటికి వచ్చిన మహేశ్‌ను అభినందించిన కేటీఆర్.. భవిష్యత్‌లో రాష్ర్టానికి, దేశానికి మరింత ఖ్యాతిని తీసుకురావాలని ఆకాంక్షించారు.