Lords Test | లార్డ్స్‌లో నిప్పులు చెరుగుతున్న భారత పేసర్లు.. కుప్పకూలిన ఇంగ్లండ్ టాపార్డర్..!
Lords Test : లార్డ్స్ టెస్టులో భారత పేసర్ క్రాంతి గౌడ్(3-18) వికెట్ల వేట కొనసాగిస్తోంది. తొలి రోజే ఓపెనర్ టమ్మీ బ్యూమంట్(2)ను ఎల్బీగా వెనక్కి పంపిన క్రాంతి.. రెండో రోజు తొలి సెషన్లోనూ ఇంగ్లండ్‌ను దెబ్బతీసింది.
Lords Test : లార్డ్స్ టెస్టులో భారత పేసర్ క్రాంతి గౌడ్(3-18) వికెట్ల వేట కొనసాగిస్తోంది. తొలి రోజే ఓపెనర్ టమ్మీ బ్యూమంట్(2)ను ఎల్బీగా వెనక్కి పంపిన క్రాంతి.. రెండో రోజు తొలి సెషన్లోనూ ఇంగ్లండ్‌ను దెబ్బతీసింది. ఓపెనర్ మియా బౌచిర్(23)ను పెవిలియన్ చేర్చిన స్పీడ్‌స్టర్.. బౌండరీలతో చెలరేగుతున్న అలిసే క్యాప్సే(9)ను స్వింగ్‌తో వెనక్కి పంపింది. అంతకుముందు సయాలీ సత్ఘరే(1-32) ఓవర్లో హీథర్ నైట్(9) వికెట్ల ముందు దొరికిపోయింది. ఫలితంగా.. ఆట మొదలైన అరగంటలోనే ఆతిథ్య జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
చరిత్రాత్మక టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 285 రన్స్ కొట్టిన భారత్ మ్యాచ్‌పై పట్టుబిగిస్తోంది. మొదటి రోజు ఆఖరి సెషన్లో కొత్త బంతితో నిప్పులు చెరిగిన భారత పేసర్ క్రాంతి గౌడ్(3-18) రెండో రోజూ విరుచుకపడుతోంది. నిన్న ఓపెనర్ టమ్మీ బ్యూమంట్(2)ను ఎల్బీగా వెనక్కి పంపిన క్రాంతి.. శనివారం తొలి సెషన్లోనే రెండు కీలక వికెట్లతో ఇంగ్లండ్‌కు షాకిచ్చింది.
Off stump uprooted 💥
Kranti Gaud with a peach of a delivery to dismiss Alice Capsey 🔥
Updates ▶️ https://t.co/O1rEau8j8n#TeamIndia | #ENGvIND pic.twitter.com/THyQjna37j
— BCCI Women (@BCCIWomen) July 11, 2026
ఊరించే బంతితో ఓపెనర్ మియా బౌచిర్(23)ను బోల్తా కొట్టించిన క్రాంతి.. అదే ఊపులో అలిసే క్యాప్సే(9)ను బౌల్డ్ చేసింది. అంతకుమందు సయాలీ సత్ఘరే బౌలింగ్‌లో తడబడిన హీథర్ నైట్(6) ఎల్బీగా ఔటయ్యింది. దాంతో, 47కే ఆతిథ్య జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్(14 నాటౌట్), అమీ జోన్స్(1 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఇంకా ఇంగ్లండ్ 229 పరుగులు వెనకంజలో ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

