Errolla Srinivas | జర్నలిస్టులపై, కేటీఆర్, హరీష్ రావులపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన అహంకారపు వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తెలంగాణభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ తనదైన స్టైల్లో అరవింద్‌పై కౌంటర్ ఎటాక్ చేశారు. కొంతమందేమో అరవింద్ అంటరు.. మరికొంతమందేమో అరగుండు అరవింద్ అంటరు. నిజామాబాద్ లాంటిప్రాంతంలో అయితే సైకో అరవింద్ అని కూడా అంటరు. కానీ పాపం ఆ విషయం మనోడికి తెలియదు. తెల్వక బలుపుతో, అహంకారంతో మొత్తం ఆయన సామ్రాజ్యం అయినట్టు, తెలంగాణ ప్రజలంతా, రాజకీయ పార్టీలంతా ఆయనకు బానిసలుగా.. ఈయననేమో మిగలినోళ్లను దొరా అంటడు. నాకు తెలిసి ఈ రోజుల్లో దొరలు ఎవరూ అట్లా మాట్లాడుతలేరు. వాళ్లు కామన్ అయిపోయిర్రు. ఈయనకు ఆ బలుపు వంద రెట్లుందన్నారు.
బిడ్డా నువ్వు డైట్ చేస్తవేమో.. డైట్ లేకుండానే నీ కొవ్వు కరిగిస్తం. గుర్తు పెట్టుకో.. నీకు డైట్ అవసరం లేదు. డైట్ లేకుండా నీ కొవ్వు కరిగే రోజు వస్తది. ఏం మాటలవి.. ఏం అహంకారం, కొవ్వొక్కి, బలుపు అహంకారంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నవ్.. మాకు తిట్టరాదా.. ఏం రా అరవింద్.. బేవకూప్ అని మాట్లాడరాదా.. మాకు.. మిస్టర్ అరవింద్..నువ్వు ఏ గడ్డ మీద పుట్టినవో.. మేం అదే గడ్డమీద పుట్టినం. పార్లమెంట్ మెంబర్‌వి నువ్వు.. వార్డ్ మెంబర్ కంటే అధ్వాన్నంగా మాట్లాడుతున్నవ్. ఏం సంస్కారం నీది..? అని ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రశ్నించారు.
ఈ రాష్ట్రంలో 20 ఏండ్ల కింద ఇట్లా లేదు. ఇట్లాంటి చిల్లరగాళ్లు వచ్చినంక రాజకీయాలు కరబ్ అయిపోయినయ్. ఎవరన్నా కొత్తోడురావాలంటే భయపడుతుండు.. ఎందుకంటే మాటలన్ని చిల్లర అయిపోయినయ్.. చేతల్లేవ్. పసుపు బోర్డు తెస్తా అని చెప్పినవ్.. పసుపు బోర్డు తెచ్చినవా..? పసుపు బోర్డు తెస్తా అని ఓట్లు వేయించుకున్నవ్.. ఉత్త బోర్డు పట్టుకొచ్చినవ్. నువ్వు గెలిచినదాని మీద మాట్లాడు అంటే ఉత్తగనే గిల్లికజ్జాలు, పంచాయతీ పెట్టుకొని మా కేటీఆర్ మీద, హరీష్ రావు మీద, జర్నలిస్టుల మీద నోటికొచ్చినట్టు మాట్లాడుతడు.. బలుపుకు కేరాఫ్ అడ్రస్ ఎవరిది అంటే ఇట్లాంటోడిని చూపించాలే. మా కేటీఆర్ మీద, హరీష్ రావు మీద, జర్నలిస్టుల మీద చేసిన అసభ్యకర కామెంట్స్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలి.. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు.
అరేయ్ అరవింద్, బెవకూఫ్ అని మేము కూడా తిట్టొచ్చు.. కానీ మేము అలా మాట్లాడము
ధర్మపురి అరవింద్ బలుపెక్కి, అహంకారంతో మాట్లాడుతున్నాడు
డైటింగ్ లేకుండా నీ కొవ్వు కరిగిస్తాము జాగ్రత్త
ఇలాంటి చిల్లర గాళ్ళ చిల్లర చేష్టల వల్లనే యువత రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆలోచిస్తుంది
జర్నలిస్టులపై,… https://t.co/6bmHi1hM6B pic.twitter.com/Gr4PBHlhsr
— Telugu Scribe (@TeluguScribe) August 15, 2026
మిస్టర్ “బేవకూఫ్” మాటల ఎంపీ గారు
మీరు మాట్లాడిన వీడియోలో “బేవకూఫ్” మాటలు …
మహేష్ కుమార్ గౌడ్ గురించి ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా “ఇప్పుడే చెప్పిన కదా బేవకూఫ్ వినాలి” అని మీరు అన్నారు
ఈ వీడియో ఎడిటింగ్ చేసింది కాదు, మార్ఫింగ్ చేసింది కాదు, ఆడియో మార్చింది కాదు… https://t.co/TUy2huQPyP pic.twitter.com/a9wtSoQhtv
— Telugu Scribe (@TeluguScribe) August 14, 2026
Weekend OTT | ఇండిపెండెన్స్ డే స్పెషల్.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన చిత్రాలివే!
FBI Report | అమెరికాలో భారీగా తగ్గిన హత్యల రేటు.. గడిచిన 75 ఏళ్లలో అత్యంత కనిష్ఠం..!
Rosemary Oil | జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రోజ్మేరీ ఆయిల్..అధ్యయనంలో వెల్లడి..