INDW vs SAW : ప్రపంచకప్‌లో అదరగొడుతున్న భారత పేసర్ క్రాంతి గౌడ్ మరోసారి తొలి వికెట్ తీసింది. సూపర్ ఫామ్‌లో ఉన్న దక్షిణాఫ్రికా ఓపెనర్ తంజిమ్ బ్రిస్త్(0)ను రిటర్న్ క్యాచ్‌తో వెనక్కి పంపింది. బ్రిస్త్ స్ట్రెయిట్‌గా ఆడిన బంతిని క్రాంతి ఎడమ చేత్తో ఒడిసిపట్టింది. దాంతో.. 6 పరుగుల వద్ద సఫారీ టీమ్ మొదటి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం కెప్టెన్ లారా వొల్వార్డ్త్(6 నాటౌట్), సునే లుస్ (1 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు. మూడు ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్.. 7-1.
ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఒకే రన్ ఇచ్చిన క్రాంతి గౌడ్ తన రెండో ఓవర్లోనే బ్రేకిచ్చింది. న్యూజిలాండ్‌పై సెంచరీతో సఫారీలను గెలిపించిన తంజిమ్ బ్రిట్స్ వికెట్ పడగొట్టిందీ పేసర్. గంటకు 109.5 కిలోమీటర్ల వేగంతో ఆమె సంధించిన బంతిని బ్రిట్స్ స్ట్రెయిట్‌గా ఆడింది. బంతిని గమనించిన క్రాంతి ఒడుపుగా ఎడమచేత్తో క్యాచ్ అందుకుంది. కఅంతే.. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సహ జట్టు సభ్యులంతా క్రాంతిని అభినందనల్లో ముంచెత్తారు.
What a great reflex catch by Kranti Gaud!!!
Catch of the Tournament???#WomensWorldCup2025 #INdw pic.twitter.com/To6r8Ct6lz— Prajwal Kalappa (@PrajwalKalappa) October 9, 2025
వరల్డ్ కప్‌లో చెలరేగిపోతున్న రీచా ఘోష్ (94) మరోసారి విలువైన ఇన్నింగ్స్ ఆడింది. వైజాగ్‌లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ల ధాటికి టాపార్డర్, మిడిలార్డర్ చేతులెత్తేయగా.. ఒంటిచేత్తో జట్టుకు భారీ స్కోర్ అందించింది. ఫినిషర్ పాత్రను పోషిస్తూ సఫారీ బౌలర్లను హడలెత్తించిన రీచా.. డెత్ ఓవర్లలో దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి పంపింది. 153కే ఏడు వికెట్లు పడిన దశలో ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా అమన్‌జోత్ కౌర్ అండగా 51 పరుగులు, రానాతో ఎనిమిదో వికెట్‌కు విలువైన 88 రన్స్ జోడించింది. ఆఖరి ఓవర్ వరకూ సాగిన ఆమె ఊచకోత కారణంగా భారత జట్టు 251 పరుగులు చేయగలిగింది.