హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయస్థాయి ఆర్చరీ పోటీల్లో కొల్లూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సత్తాచాటారు. గత రెండు రోజులుగా కొల్లూరులో జరుగుతున్న పోటీలు మంగళవారంతో ముగిశాయి. ఈ టోర్నీలో 20 రాష్ర్టాలకు చెందిన దాదాపు 150 మందికి పైగా ఆర్చర్లు ఇందులో పోటీపడ్డారు. డీపీఎస్ ఆర్చర్లు ఏకంగా 22 పతకాలు కొల్లగొట్టి ఓవరాల్ చాంపియన్షిప్ టైటిల్ దక్కించుకున్నారు. వేర్వేరు వయసు విభాగపు కాంపౌండ్, రికర్వ్ పోటీల్లో 8 స్వర్ణాలు సహా 7 రజతాలు, 7 కాంస్యాలతో అగ్రస్థానంలో నిలిచారు. డీపీఎస్ చైర్మన్ భీంసేన్, కార్యదర్శి పవన్ విజేతలను అభినందించారు.