IPL 2024 KKR vs DC : ఆద్యంతం ఉత్కంఠగా సాగుతున్న ఐపీఎల్ 17వ సీజన్లో మరో కీలక మ్యాచ్కు కాసేపట్లో తెరలేవనుంది. రెండు విజయాలతో జోరుమీదున్న కోల్కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)ను ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ఢీకొట్టనుంది. వైజాగ్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ తీసుకున్నాడు.
ఇరుజట్లు రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. ఈ పోరులో కోల్కతా హ్యాట్రిక్ కొడుతుందా? అచ్చొచ్చిన వైజాగ్లో ఢిల్లీ మరో విజయం సాధిస్తుందా? అనేది మరికొన్ని గంటల్లో తెలిసిపోనుంది.
ఢిల్లీ జట్టు : డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిషభ్ పంత్(కెప్టెన్), మిచెల్ మార్ష్, టిట్సన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, రసిఖ్ దార్ సలామ్, అన్రిచ్ నోర్జియా, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.
కోల్కతా జట్టు : ఫిలిఫ్ సాల్ట్, వెంకటేశ్ అయ్యర్, ఆండ్రూ రస్సెల్, నితీశ్ రానా, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రింకూ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, సునీల్ నరైన్, రమన్దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి.