Virat Kohli : గల్లీ క్రికెట్(Gully Cricket)లో బ్యాట్ పట్టుకున్న బుడ్డోడి నుంచి జాతీయ జట్టు(National Team)కు ఆడాలని కలలు కనే కుర్రాడి వరకూ ప్రతి ఒక్కరూ విరాట్ కోహ్లీ(Virat Kohli) అభిమానులే. అలాంటిది ఈ టీమ్ఇండియా స్టార్ ఎవరికి అభిమానో మీకు తెలుసా! విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న విరాట్ ఎవరి ఆటకు ఫిదా అవుతాడో తెలుసుకోవాలని ఉందా? మరింకెందుకు ఆలస్యం ఆ వివరాలు చదివేయండి.
ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దంచికొడుతూ విరాట్ కోహ్లీ రికార్డుల రారాజుగా పేరు, ప్రఖ్యాతలు సంపాదించాడు. ఈ స్టార్ ప్లేయర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar)కు వీరాభిమాని అన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. చిన్నప్పటి నుంచి మాస్టర్ బ్యాటింగ్ చూస్తూ పెరిగిన కోహ్లీ కెరీర్ ఆరంభంలోనే తన ఆరాధ్య దైవంతో కలిసి ఆడే అవకాశం దక్కించుకున్నాడు. మైదానంలోనే కాకుండా బయట కూడా సచిన్‌ను దగ్గర నుంచి గమనించిన విరాట్.. మాస్టర్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని గతంలో చెప్పాడు.
విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్
అయితే.. ప్రస్తుతం ఆడుతున్న వాళ్లలో ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? అనే ప్రశ్నకు కోహ్లీ ఊహించని సమాధానం చెప్పాడు. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(Ben Stokes)కు తాను అభిమానినని వెల్లడించాడు. ఇంగ్లండ్ జట్టు తొలిసారి వన్డే ప్రపంచ కప్ గెలువడంలో కీలక పాత్ర పోషించిన స్టోక్స్ అంటే తనకు చాలా ఇష్టమని విరాట్ చెప్పాడు.
విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్
అంతర్జాతీయ క్రికెట్లో చాన్నాళ్లుగా కొనసాగుతున్న జో రూట్(Joe Root), కేన్ విలియమ్సన్(Kane Williamson), స్టీవ్ స్మిత్(Steve Smith) లేదా తనకెంతో ఇష్టమైన దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్(AB de Villiers) పేరు చెబుతాడనుకున్నారంతా. కానీ కోహ్లీ మాత్రం స్టోక్స్ తన ఫేవరెట్ అని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.