Barcelona Footballer : ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్ బార్సిలోనా(Barcelona) ఆటగాడు పబ్‌లో మార్టిన్ పేజ్ గవిర(Pablo Martín Páez Gavira) సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గవిగా ప్రసిద్ది చెందిన అతను ఆ క్లబ్ తరఫున 100 మ్యాచ్‌లు ఆడిన అతిచిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం గవి వయసు 19 ఏళ్ల 27 రోజులు. ఈరోజు ఒసాసునా(Osasuna)తో జరిగిన మ్యాచ్‌లో ఈ యంగ్‌స్టర్ నాలుగో మిడ్‌ఫీల్డర్‌గా మైదానంలోకి దిగాడు. దాంతో, బార్సిలోనా తరఫున వంద మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు.
Where it all began. 🏡#MadeInLaMasia pic.twitter.com/T4mPc0aGf7
— FC Barcelona (@FCBarcelona) September 4, 2023
ఫుట్‌బాల్ ఆటే ప్రపంచంగా పెరిగిన గవి 2021 ఆగస్టులో బార్సిలోనా జట్టులోకి వచ్చాడు. అప్పటికీ అతడికి 17 ఏళ్లు మాత్రమే. వయసులో చిన్నవాడైనా ఆటలో మాత్రం అదరగొట్టాడు. ఈ రెండేళ్లలో బార్సిలోనా జట్టు స్పానిష్ సూపర్ కప్(Spanish Super Cup), లలిగా టైటిల్(laliga title) గెలవడంలో గవి కీలక పాత్ర పోషించాడు. 6 గోల్స్ కొట్టడమే కాకుండా 13 గోల్స్‌కు సహకారం అందించాడు. అతను 50 విజయాలు ఖాతాలో వేసుకున్నాడు. 20 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. 21 గేమ్స్‌లో బార్సిలోనా ఓడిపోయింది. ప్రతిభావంతుడైన ఈ యంగ్‌స్టర్ 2026 జూన్ వరకు బార్సిలోనాతో కొనసాగనున్నాడు.