Asia cup 2023 | దంచి కొట్టిన నేపాల్ బ్యాటర్లు.. టీమిండియా లక్ష్యం ఎంతంటే..?
Asia cup 2023 : వరుణుడు అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో నేపాల్ బ్యాటర్లు(Nepal Batters) దంచి కొట్టారు. టాపార్డర్‌తో సహా లోయర్ ఆర్డర్ కూడా బ్యాట్ ఝులిపించడంతో ఆ జట్టు 230 పరుగులు చేసింది. యువ ఓపెనర్ అసిఫ్ షేక్ (58) అర్ధ శతకంలో జట్టు భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. చివర్లో సొంపల్ కమీ(48) ధనాధన్ ఇన్నింగ్స్‌తో జట్టు స్కోర్....
Asia cup 2023 : వరుణుడు అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో నేపాల్ బ్యాటర్లు(Nepal Batters) దంచి కొట్టారు. టాపార్డర్‌తో సహా లోయర్ ఆర్డర్ కూడా బ్యాట్ ఝులిపించడంతో ఆ జట్టు 230 పరుగులు చేసింది. యువ ఓపెనర్ అసిఫ్ షేక్ (58) అర్ధ శతకంలో జట్టు భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. చివర్లో సొంపల్ కమీ(48) ధనాధన్ ఇన్నింగ్స్‌తో జట్టు స్కోర్ 200 దాటించాడు. అయితే.. 48వ ఓవర్లో షమీ కమీని ఔట్ చేశాడు. అదే ఓవర్లో సందీప్ లమిచానే(9) రనౌటయ్యాడు. చివరి వికెట్‌గా వచ్చిన లలిల్ రాజ్‌బన్షీ(0)ని సిరాజ్ బౌల్డ్ చేయడంతో నేపాల్ 230 రన్స్‌కు పరిమితమైంది. భారత బౌలర్లలో జడేజా, సిరాజ్ మూడేసి వికెట్లు పడగొట్టారు.
టాస్ గెలిచిన రోహిత్ శర్మ నేపాల్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఓపెనర్లు కుశాల్ భ్రుటెల్(38), అసిఫ్ షేక్ (58) ధాటిగా ఆడారు. భారత ఫీల్డర్లు మూడు క్యాచ్‌లు నేలపాలు చేయడం వీళ్లకు కలిసొచ్చింది. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 65 రన్స్ జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని శార్దూల్ ఠాకూర్ విడదీశాడు.
అసిఫ్ షేక్ (58)

ఆ తర్వాత రవీంద్ర జడేజా దెబ్బకు నేపాల్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. భీమ్ షర్కి (7), రోహిత్ పౌడెల్(5), కుశాల్ మల్లా(2)ను పెవిలియన్ పంపి జడ్డూ భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. అయితే.. గుల్షన్ ఝా(23)తో జత కలిసి అసిఫ్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 88 బంతుల్లో 7 ఫోర్లతో హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. దాంతో, భారత్‌పై ఫిఫ్టీ బాదిన తొలి నేపాల్ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. జోరు మీదున్న అతడిని సిరాజ్ వెనక్కి పంపాడు.
అయితే.. 37వ ఓవర్ ఆఖరి బంతికి వర్షం మొదలైంది. అప్పటికీ నేపాల్ 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. వర్షం తగ్గాక మళ్లీ మ్యాచ్ మొదలైంది. దీపేంద్ర సింగ్ అరీ(29), సొంపల్ కమీ(11) ఏడో వికెట్‌కు 50 రన్స్ జోడించారు. అయితే.. దీపేంద్ర సింగ్‌ను హార్దిక్ పాండ్యా ఔట్ చేయడంతో నేపాల్ స్కోర్ నెమ్మదించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

