ODI Ranks | వన్డే ఇంటర్నేషనల్ ర్యాంకులను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం ప్రకటించింది. శ్రీలంకతో తొలి వన్డేలో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ వన్డే ర్యాంకింగ్స్‌లో మెరిశాడు. కోహ్లీకి ఐదో స్థానం దక్కింది. కాగా, వన్డేల్లో పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజం 891 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 2 స్థానాలు ఎగబాకి 6 వ ర్యాంక్‌కు చేరాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఒక ర్యాంక్‌ను మెరుగుపరుచుకుని 715 రేటింగ్ పాయింట్లతో 8వ స్థానాన్ని అందుకున్నాడు. విరాట్ కోహ్లీ ఒక రోజు క్రితం శ్రీలంకతో జరిగిన వన్డేలో 113 పరుగులతో సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇలాఉండగా, వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-10లో ఏ భారతీయుడికి చోటు దక్కలేదు. శ్రీలంకపై 2 వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్ 18వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. అతడి తర్వాత జస్ప్రీత్ బుమ్రా 19వ ర్యాంక్‌లో ఉన్నాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్‌లో టాప్-20లో ఒక్క భారతీయ ఆటగాడి పేరు లేదు.
టీ 20 లో సూర్యకుమార్ యాదవ్ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన భారత బ్యాట్స్‌మెన్‌గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. ఎస్కేవైకి 908 రేటింగ్ పాయింట్లు లభించాయి. సూర్యకుమార్ కన్నా ముందు 900 రేటింగ్ పాయింట్‌ను ఏ ఒక్క భారతీయుడు సాధించలేదు. విరాట్‌కోహ్లీ మాత్రం 897 పాయింట్లు పొందాడు.