IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో చేలరేగిపోతున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) చరిత్రకు అడుగుదూరంలో నిలిచాడు. ఈ ఎడిషన్‌లో ఇప్పటికే 7 హాఫ్ సెంచరీతో గర్జించిన విరాట్.. మరో ఒక ఫిఫ్టీ సాధించాడంటే ఈ లీగ్‌లో ‘ఆల్‌టైమ్ రికార్డు’ బద్ధలు కొడుతాడు. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 62 అర్ధ శతకాలు ఉన్నాయి. భీకర ఫామ్‌లో ఉన్న ఈ రన్ మెషీన్ మరొకసారి బ్యాటు ఝులిపించి యాభైకి చేరువైతే… డేవిడ్ వార్నర్ (David Warner)ను అధిగమిస్తాడు.
ఐపీఎల్లో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లలో కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు. 2016లో నాలుగు సెంచరీలో రికార్డులు నెలకొల్పిన విరాట్.. ప్రస్తుతం అర్ద శతకాలతోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం అతడు 62 ఫిఫ్టీలతో డేవిడ్ వార్నర్‌తో సమానంగా ఉన్నాడు. ఆసీస్ ఓపెనర్ ఐపీఎల్‌కు దూరం కావడంతో అతడి రికార్డును బ్రేక్ చేసే సువర్ణావకాశం కోహ్లీకి రానుంది. శనివారం చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతాపై కింగ్ కోహ్లీ ఈ రికార్డు బ్రేక్ చేయాలని యావత్ ఆర్సీబీ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Virat Kohli has another IPL record in his sights ⌛ pic.twitter.com/EFddzIjpU1
— ESPNcricinfo (@ESPNcricinfo) May 17, 2025
వార్నర్ 184 ఇన్నింగ్స్‌ల్లో 62 ఫిఫ్టీలు బాదగా.. కోహ్లీ 255 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. ఇక పంజాబ్ కింగ్స్ మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) 51 హాఫ్ సెంచరీతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అభిమానులు ముద్దుగా గబ్బర్‌గా పిలుచుకునే ధావన్ 221 ఇన్నింగ్స్‌ల్లో ఇన్ని యాభైలు సాధించాడు.
వారం రోజులకుపైగా వాయిదా పడిన ఐపీఎల్ 18వ సీజన్ లీగ్ మ్యాచ్‌లు నేటితో పునః ప్రారంభం కానున్నాయి. హిటర్ల బ్యాటింగ్ మెరుపులు.. బౌలర్ల వికెట్ సంబురాలను చూడలేకపోయిన అభిమానులు ఇక పండుగ చేసుకోనున్నారు. ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారిన వేళ శనివారం బెంగళూరులో ఐపీఎల్ షో టైమ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)ను కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఢీ కొడుతోంది. ఈ మ్యాచ్‌తో మళ్లీ ఐపీఎల్ సందడి మొదలవుతుండడంతో భారీగా ఫ్యాన్స్ మైదానానికి తరలి రానున్నారు.
2️⃣-0️⃣ for #RCB over #KKR this season? ❤
Or will KKR make it 1️⃣-1️⃣? 💜
We’re closing in on the #TATAIPL 2025 resumption 🤩#RCBvKKR | @RCBTweets | @KKRiders pic.twitter.com/zhv5rxwvsD
— IndianPremierLeague (@IPL) May 17, 2025