దుండిగల్, మే17: మెరుగైన, మౌళిక వసతుల కల్పనతో కుత్బుల్లాపూర్ను ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. గాజుల రామారం డివిజన్ మిథిలా నగర్లో రూ. 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద శనివారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించి అభివృద్ధి చేసే దిశగా పని చేస్తున్నట్టు తెలిపారు.