బ్రదర్.. ఐ లవ్ యూ.. రిటైర్మెంట్ ప్రకటించిన డివిలియర్స్‌కు కోహ్లీ సందేశం
Kohli on AB de Villiers Retirement | ఈ నిర్ణయం నా మనసుకు చాలా బాధ కలిగిస్తోంది. కానీ ఎప్పట్లాగే నీ గురించి, నీ కుటుంబం గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకొని ఉంటావని నాకు తెలుసు. ఐ లవ్ యూ

Kohli on AB de Villiers Retirement | ఐపీఎల్లో మరో శకం ముగిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ తన రిటైర్మెంట్ ప్రకటించాడు. గతంలోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన ఏబీడీ.. ఐపీఎల్ వంటి లీగ్‌లు ఆడుతున్నాడు. తాజాగా వీటి నుంచి కూడా వీడ్కోలు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. దీనిపై ఆర్సీబీ జట్టులో అతని కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు.
‘మన తరంలో ఉత్తమ ఆటగాడు, నేను కలిసిన వారిలో అందరికన్నా స్ఫూర్తిమంతమైన వ్యక్తి. నువ్వు ఇప్పటి వరకూ సాధించిన విజయాలు, ఆర్సీబీకి నువ్వు చేసిన సేవ చూసి నువ్వు గర్వించాలి బ్రదర్. మన బంధం ఆటను ఎప్పుడో దాటేసింది. ఎప్పటికీ అలాగే ఉంటుంది కూడా’ అని చెప్పాడు.
అలాగే రిటైర్ అవ్వాలనే ఏబీడీ నిర్ణయం గురించి కూడా ప్రస్తావించాడు. ‘ఈ నిర్ణయం నా మనసుకు చాలా బాధ కలిగిస్తోంది. కానీ ఎప్పట్లాగే నీ గురించి, నీ కుటుంబం గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకొని ఉంటావని నాకు తెలుసు. ఐ లవ్ యూ’ అంటూ కోహ్లీ ట్వీట్ చేశాడు.

దీనికి స్పందించిన డివిలియర్స్.. ‘లవ్ యూ టూ మై బ్రదర్’ (నువ్వంటే నాక్కూడా ఇష్టమే సోదరా) అని రిప్లై ఇచ్చాడు. వీరిద్దరూ కలిసి ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు చాలా ఏళ్లుగా ఆడారు. ఈ టోర్నీలో పదిసార్లు 100పైగా భాగస్వామ్యం నెలకొల్పిన రికార్డు ఈ జోడీ పేరిటే ఉంది.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యం రికార్డు కూడా వీరి పేరిటే ఉంది. 2016లో కొత్త జట్టు గుజరాత్ లయన్స్‌పై రెండో వికెట్‌కు 229 పరుగులు చేసిన వీళ్లు.. అంతకుముందు సంవత్సరంలో ముంబై ఇండియన్స్‌పై 215 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
It has been an incredible journey, but I have decided to retire from all cricket.
— AB de Villiers (@ABdeVilliers17) November 19, 2021
Ever since the back yard matches with my older brothers, I have played the game with pure enjoyment and unbridled enthusiasm. Now, at the age of 37, that flame no longer burns so brightly. pic.twitter.com/W1Z41wFeli
This hurts my heart but I know you've made the best decision for yourself and your family like you've always done. 💔I love you 💔 @ABdeVilliers17
— Virat Kohli (@imVkohli) November 19, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

