IPL 2025 : బౌండరీలతో చెలరేగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఓపెనర్ విరాట్ కోహ్లీ(53) అర్ధ శతకం సాధించాడు. విఘ్నేశ్ పుతూర్ బౌలింగ్‌లో సిక్సర్‌తో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడీ స్టార్ బ్యాటర్. 29 బంతుల్లోనే యాభై బాదిన కోహ్లీ టీ20ల్లో అర్ధ శతకం పైగా స్కోర్ చేయడం ఇది 90వ సారి. అయితే.. అదే ఓవర్ ఆఖరి బంతికి దేవ్‌దత్ పడిక్కల్(37) భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద విల్ జాక్స్ క్యాచ్ అందుకున్నాడు. దాంతో, 95 వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం కెప్టెన్ రజత్ పాటిదార్(3)తో కలిసి జట్టుకు పెద్ద స్కోర్ అందించే పనిలో ఉన్నాడు విరాట్. 10 ఓవర్లకు బెంగళూరు స్కోర్.. 100-3.
ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే వికెట్ తీసే అలవాటున్న ట్రెంట్ బౌల్ట్ బెంగళూరుకు ఆదిలోనే షాకిచ్చాడు. రెండో బంతికే డేంజరస్ ఫిలిప్ సాల్ట్(4)ను బౌల్డ్ చేసి ముంబైకి బ్రేకిచ్చాడు. ఈ స్పీడ్‌స్టర్ ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీయడం 31వ సారి. 4 పరుగులకే తొలి వికెట్ పడిన వేళ.. విరాట్ కోహ్లీ() జట్టుపై ఒత్తిడి పడనీయలేదు.
Man on a Mission 🫡
2️⃣nd Fifty of the season for Virat Kohli and he gets there with a Maximum 👑
He continues to grace Wankhede with his class 👌
Updates ▶ https://t.co/Arsodkwgqg#TATAIPL | #MIvRCB | @imVkohli pic.twitter.com/GANrHXtJeH
— IndianPremierLeague (@IPL) April 7, 2025
చాహర్ బౌలింగ్‌లో 4 కొట్టిన విరాట్.. ఆపై బౌల్ట్ బౌలింగ్‌లోనూ రెండుసార్లు బంతిని బౌండరీకి పంపాడు. విల్ జాక్స్ వేసిన 5వ ఓవర్లో కోహ్లీ ఫోర్ కొట్టగా ఆర్సీబీ స్కోర్ 50కి చేరింది. దీపక్ చాహర్ వేసిన 6వ ఓవర్లో పడిక్కల్ వరుసగా 6, 6, 4 బదడంతో 20 పరుగులు వచ్చాయి. దాంతో, ఆర్సీబీ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది.