Sompal Kami : ఫిట్నెస్ ఐకాన్ అయిన విరాట్ కోహ్లీ(Virat kohli)తో సెల్ఫీ దిగేందుకు అభిమానులే కాదు విదేశీ క్రికెటర్లు కూడా పోటీ పడుతుంటారు. ఈ భారత స్టార్ ఆటగాడు కంట పడితే చాలు ఆటోగ్రాఫ్(Autograph) కోసం ఎగబడతారు. తాజాగా నేపాల్ క్రికెటర్ సోంపల్ కమీ(Sompal Kami) విరాట్‌తో సెల్ఫీ దిగి, ఆటోగ్రాఫ్ తీసుకొని సంబుర పడిపోయాడు. భారత్, నేపాల్ మ్యాచ్ అనంతరం కమీ షూపై కోహ్లీ సంతకం చేశాడు. ఆరాధ్య ఆటగాడిని కలవడంతో మనోడి సంతోషానికి హద్దే లేకుండా పోయింది.
విరాట్‌తో దిగిన ఫొటోలను కమీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలకు ‘కోహ్లీ క్రికెటర్ మాత్రమే కాదు.. ఒక ఎమోషన్’ అని క్యాప్షన్ రాశాడు. ఇప్పుడు ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తొలిసారి ఆసియా కప్‌లో ఆడుతున్న కమీ 2 మ్యాచుల్లో 76 పరుగులు చేశాడు. అయితే వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన నేపాల్ జట్టు సూపర్-4కు క్వాలిఫై కాలేదు.
Virat Kohli is not just a cricketer, he’s an emotion.” #motivation #viratkohli #instagram #instapic #respect #cricket #dreamcometrue pic.twitter.com/XIwbWtzeL0
— Sompal Kami (@Sompal_Kami) September 5, 2023
ఆసియా కప్‌లో భాగంగా నిన్న పల్లెకెలె స్టేడియంలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో కమీ అద్భుతంగా రాణించాడు. లోయర్ ఆర్డర్లో ధాటిగా ఆడిన అతను 48 పరుగులు చేశాడు. దీపేంద్ర సింగ్(29)తో కలిసి జట్టు స్కోర్ 200 దాటించాడు. అయితే.. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం అంపైర్లు మ్యాచ్‌ను 23 ఓవర్లకు కుదించారు. 147 పరుగుల ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ(74 నాటౌట్), శుభ్‌మన్ గిల్(67 నాటౌట్) దంచి కొట్టారు. దాంతో, మరో 11 బంతులు ఉండగానే భారత జట్టు గెలుపొందింది. ఈ విజయంతో సూపర్ -4కు అర్హత సాధించింది.