సిడ్నీ: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెండేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి మళ్లీ 1000 పరుగుల మైలురాయిని దాటాడు. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇవాళ నెదర్లాండ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ కేవలం 44 బంతులు ఆడి అజేయమైన 62 పరుగులు చేశాడు. అందులో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.
తాజా స్కోరుతో కలిపి ఈ క్యాలెండర్ ఇయర్లో కోహ్లీ మొత్తం 1024 పరుగులు చేసినట్లయ్యింది. మొత్తం 28 మ్యాచ్‌లలో 31 ఇన్నింగ్స్ ఆడి 39.38 సగటుతో ఈ స్కోర్ చేశాడు. అందులో ఒక సెంచరీ, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యున్నత వ్యక్తిగత స్కోర్ 122 నాటౌట్. అంతకుముందు 2019లో 1000 పరుగుల మార్క్ దాటిన కోహ్లీ.. మళ్లీ 1000 పరుగులు దాటడం ఇప్పుడే.
కాగా, 2020, 2021లో కోహ్లీ పూర్తిగా ఫామ్ కోల్పోయాడు. ఆ రెండేండ్లలో నిలకడగా రాణించలేకపోయాడు. 2020లో 842 పరుగులు, 2021లో 964 పరుగులు మాత్రమే చేయగలిగాడు.