శుక్రవారం 15 జనవరి 2021
Sports - Dec 15, 2020 , 17:31:59

టాప్‌-10లో కోహ్లీ, పుజారా, రహానె

టాప్‌-10లో కోహ్లీ, పుజారా, రహానె

దుబాయ్‌: ఐసీసీ టెస్టు ప్లేయర్‌ ర్యాంకింగ్స్‌లో ముగ్గురు టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్లకు టాప్‌-10లో చోటు దక్కింది. టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ టెస్టు మ్యాచ్‌ ఆడకపోయినా  రెండో స్థానానికి దూసుకెళ్లాడు. న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ ఒక ర్యాంకు కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు.  టెస్టు స్పెషలిస్ట్‌ పుజారా ఏడో ర్యాంకును నిలబెట్టుకోగా ఆజింక్య రహానె పదో ర్యాంకు దక్కించుకున్నాడు. 

ఆస్ట్రేలియా స్టార్‌ ప్లేయర్‌ స్టీవ్‌ స్మిత్‌ 911 రేటింగ్‌ పాయింట్లతో బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.  టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ ఒక స్థానాన్ని మెరుగుపరచుకొని పదో స్థానంలో నిలిచాడు. ఆసీస్‌ స్పీడ్‌స్టర్‌ పాట్‌ కమిన్స్‌ నంబర్‌వన్‌ బౌలర్‌గా కొనసాగుతున్నాడు.   వెస్టిండీస్‌తో  రెండు టెస్టుల సిరీస్‌ను కివీస్‌ 2-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.