మంగళవారం 04 ఆగస్టు 2020
Sports - Jul 07, 2020 , 11:21:47

ధోనీకి బ‌ర్త్‌డే విషెస్ చెప్పిన కోహ్లీ, సెహ్వాగ్‌

ధోనీకి బ‌ర్త్‌డే విషెస్ చెప్పిన కోహ్లీ, సెహ్వాగ్‌

హైద‌రాబాద్‌: భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పుట్టిన రోజు ఇవాళ‌.  ఈ సంద‌ర్భంగా ధోనీకి బ‌ర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి.  మ‌హీ భాయ్ హ్యాపీబ‌ర్త్‌డే అంటూ కెప్టెన్ విరాట్ కోహ్లీ గ్రీటింగ్స్ తెలిపారు.  త‌న ట్విట్ట‌ర్‌లో ధోనీతో దిగిన కొన్ని ఫోటోల‌ను కోహ్లీ ట్వీట్ చేశాడు. ఎప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంతో ఉండాలంటూ కోహ్లీ విష్ చేశాడు.  ధోనీ ముఖంలో ఎప్పుడూ చిరున‌వ్వు క‌నిపించాలంటూ కోహ్లీ త‌న ట్వీట్‌లో దేవున్ని ప్రార్థించాడు.  

బీసీసీఐ, ఐసీసీ కూడా మిస్ట‌ర్ కూల్ ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపాయి. 39వ ప‌డిలోకి అడుగుపెట్టిన ధోనీకి.. మాజీ క్రికెట‌ర్ వీరూ కూడా విషెస్ తెలిపారు. త‌రానికి ఓ ప్లేయ‌ర్ వ‌స్తాడ‌ని, దేశం ఆ ప్లేయ‌ర్‌తో ఏకం అవుతుంద‌ని, అత‌ని కుటుంబంలో స‌భ్యుడినైనందుకు థ్యాంక్స్ అంటూ వీరూ ట్వీట్ చేశాడు.  logo