IPL 2025 : తొలి ఐపీఎల్ ట్రోఫీ వేటను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) ఘనంగా మొదలు పెట్టింది. ఈడెన్ గార్డెన్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)కు చెక్ పెట్టింది. విరాట్ కోహ్లీ(59 నాటౌట్ : 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫిలిప్ సాల్ట్(56)లు విధ్వంసక బ్యాటింగ్ చేయగా 7వికెట్ల తేడాతో జయభేరి మోగించిన బెంగళూరు అదిరిపోయే బోణీ కొట్టింది. 175 పరుగుల భారీ ఛేదనలో బౌండరీలతో విరుచుకుపడగా.. ఆఖర్లో కెప్టెన్ రజత్ పాటిదార్(34) సాధికారిక ఇన్నింగ్స్ ఆడి విజయాన్ని తేలిక చేశాడు. 17 సీజన్లు గా టైటిల్ కోసం నిరీక్షిస్తున్న ఆర్సీబీ ఈసారి తమ కలను సాకారం చేసుకొనే దిశగా.. మొదటి అడుగు వేసింది.
ఐపీఎల్ అంటేనే చిచ్చరపిడుగుల మెరుపులు. వారెవా అనిపించే స్టార్ ఆటగాళ్ల బ్యాటింగ్ విన్యాసాలు. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కోల్‌కతా నైట్ రైడర్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. ఆఖరి ఓవర్ థ్రిల్లర్‌కు అవకాశం ఇవ్వకుండా మరో 2.4 ఓవర్లు మిగిలి ఉండగానే జయభేరి మోగించింది. స్పెన్సర్ బౌలింగ్‌లో వరుసగా 6, 4 బాదిన లివింగ్ స్టోన్(15 నాటౌట్) జట్టుకు అద్భుత విజయంలో భాగమయ్యాడు.
#RCB fans, enjoyed your captain’s innings?
Rajat Patidar sprinkled his elegant touch to the chase with a quick-fire 34(16) 💥@RCBTweets moving closer to the target 🎯
Updates ▶ https://t.co/C9xIFpQDTn#TATAIPL | #KKRvRCB | @RCBTweets | @rrjjt_01 pic.twitter.com/1P7buQ8m0O
— IndianPremierLeague (@IPL) March 22, 2025
ఛేదనలో మొదటి ఓవర్ నుంచే ఓపెనర్లు విరాట్ కోహ్లీ(59 నాటౌట్ : 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫిలిప్ సాల్ట్(56)లు దూకుడుగా ఆడారు. ఇన్నింగ్స్ మొదటి బంతినే బౌండరీకి పంపిన సాల్ట్ ఇక 3 ఓవర్లో రెచ్చిపోయాడు. వైభవ్ అరోరాకు చుక్కలు చూపిస్తూ 4,6, 4 బాది.. 20 పరుగులు పిండుకున్నాడు. నేనేమీ తక్కువా అన్నట్టు విరాట్ కోహ్లీ.. వరుసగా రెండు స్ట్రెయిట్ సిక్సర్లతో స్పెన్సర్ జాన్సన్‌పై విరుచుకుపడ్డాడు. దాంతో, ఆర్సీబీ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా పరుగులు చేసింది. హర్షిత్ రానా వేసిన 15వ ఓవర్లో పాటిదార్ వీరవిహారం చేశాడు. నాలుగు బండరీలతో లక్ష్యాన్ని మరింత తేలిక చేశాడు.
శ్రేయా ఘోషల్, పంజాబీ సింగర్ పాటల ప్రవాహం తర్వాత .. షారుక్ ఖాన్ మెస్మరైజింగ్ యాంకరింగ్ ముగిశాక టాస్ గెలిచిన ఆర్సీబీ .. కోల్‌కతాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తమ సొంత మైదానంలో కెప్టెన్ అజింక్యా రహానే(56), సునీల్ నరైన్(44)ల విధ్వంసక ఇన్నింగ్స్ ఆడడంతో ఆ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముందు 175 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. ఒకదశలో ఈ ఇద్దరి మెరుపులతో 200 కొట్టేలా కనిపించిన కోల్‌కతాను ఆర్సీబీ స్పిన్నర్ కృనాల్ పాండ్యా(3/29), హేజిల్‌వుడ్(2/22)లు 180లోపే కట్టడి చేశారు. దాంతో, 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 రన్స్‌కే పరిమితమైంది.
Effective spell 🫡
Krunal Pandya leads RCB’s charge with 3/29 👏
🔽 Watch | #TATAIPL | #KKRvRCB | @krunalpandya24
— IndianPremierLeague (@IPL) March 22, 2025
హేజిల్‌వుడ్ ఊరించే బంతితో తొలి ఓవర్లోనే క్వింటన్ డికాక్(4)ను వెనక్కి పంపి ఆర్సీబీకి శుభారంభమిచ్చాడు. 4 పరుగులకే తొలి వికెట్ పడిన జట్టును రహానే(56), నరైన్ ఆదుకున్నారు. రసిక్ దారు వేసిన 4వ ఓ ఓవర్లో రెచ్చిపోయిన రహానే 4, 6, 6 బాది ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. నరైన్ సైతం తగ్గేదేలే అన్నట్టు దంచికొట్టగా రెండో వికెట్‌కు 103 పరుగులు జమయ్యాయి. అర్థ శతకం దిశగా దూసుకెళ్తున్న నరైన్‌ను ఔట్ చేసిన రసిక్ ఆర్సీబీకి బ్రేకిచ్చాడు. ఆ కాసేపటికే దంచికొడుతున్న రహానేకు చెక్ పెట్టిన కృనాల్ పాండ్యా వైస్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్(6)ను బౌల్డ్ చేసి కోల్‌కతాను దెబ్బకొట్టాడు. అక్కడితో 145కే నాలుగు వికెట్లు పడడంతో కోల్‌కతా ఇన్నింగ్స్ స్లో అయింది.
రహానే, నరైన్‌లు ఔటయ్యాక కోల్‌కతా స్కోర్ వేగం తగ్గింది. డేంజరస్ రింకూ సింగ్(12), ఆండ్రూ రస్సెల్(4)లు విఫలమవ్వగా యువకెరటం అంగ్కృష్ రఘువంశీ(30) జట్టుకు భారీ స్కోర్ అందించే బాధ్యత తీసుకున్నాడు. పెద్ద షాట్లు ఆడిన అతడు.. హేజిల్‌వుడ్ ఓవర్లో సిక్సర్ బాది స్కోర్ 160 దాటించాడు.