Kohli – Sachin : ప్రపంచ క్రికెట్లో రికార్డుల దుమ్ముదులిపిన విరాట్ కోహ్లీ(Virat Kohli), సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar)లు మరో రికార్డు సాధించారు. మైదానంలో తమ సొగసైన ఆటతో అభిమానుల మనసు గెలిచిన ఈ ఇద్దరూ.. ఇప్పుడు వికీపీడియా(Wikipedia)లో రికార్డు నెలకొల్పారు. గూగుల్‌లో అత్యధిక మంది వెతికిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన కోహ్లీ తాజాగా వికీపీడియాలోనూ టాప్‌లో నిలిచాడు.
ఇక వరల్డ్ క్రికెట్‌ను తన బ్యాటింగ్ విన్యాసాలతో శాసించిన సచిన్ రెండో స్థానం దక్కించుకున్నాడు. ఎక్కువ మంది వెతికిన టాప్ -30 అథ్లెట్ల జాబితాను వికీపీడియాలో విడుదుల చేసింది. అందులో ఉన్న ఇద్దరు క్రికెటర్లు కోహ్లీ, సచిన్‌లే కావడం గమనార్హం. కోహ్లీ 5.6 కోట్ల వ్యూస్‌తో టాప్‌లో నిలవగా.. సచిన్ 4.4 కోట్ల వ్యూస్‌తో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
Virat Kohli & Sachin Tendulkar only two cricketers in the top 30 most viewed Wikipedia pages of athletes 🔥
Virat Kohli – 56 Million
Sachin Tendulkar – 44 Million pic.twitter.com/7ORtCcGBXH— Johns. (@CricCrazyJohns) April 1, 2024
భారత క్రికెట్‌కు ఎనలేని గుర్తింపు తెచ్చిన సచిన్ వీడ్కోలు తర్వాత మెంటార్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్(Mumbai Indians)కు తన విలువైన సలహాలు, సూచనలు ఇస్తున్నాడు. మరోవైపు కోహ్లీ అలుపెరగని యోధుడిలా పరుగుల వరద పారిస్తున్నాడు. 16వ సీజన్లో ఉతికారేసిన విరాట్ ఈ సీజన్లోనూ రఫ్పాడిస్తున్నాడు. కెప్టెన్ డూప్లెసిస్‌తో కలిసి ఆర్సీబీకి శుభారంభాలు ఇస్తున్నాడు.