ఖమ్మం రూరల్, డిసెంబర్ 22 : కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి, పాలేరుకు కందాల ఉపేందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా రావాలని కోరుతూ ఖమ్మం జిల్లా రూరల్ మండలం నాయుడుపేట కాలనీకి చెందిన అయ్యప్ప మాలధారుడు మేకల ఉదయ్ శబరిమల అయ్యప్పస్వామి సన్నిధానం ఆవరణలో ఫ్లెక్సీని ప్రదర్శించారు.
కాలనీకి చెందిన మేకల ఉదయ్.. మిత్రులతో కలిసి ఇరుముడి సమర్పించేందుకు శబరిమలకు బయలుదేరాడు. సోమవారం స్వామివారికి ఇరుముడి సమర్పించే సమయంలో ‘తెలంగాణలో కేసీఆర్ రావాలి.. పాలేరులో తిరిగి కందాల రావాలి’ అనే నినాదంతో ముద్రించిన ఫ్లెక్సీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యావత్ తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో కేసీఆర్ పాలన రావాలని, పాలేరులో కందాల ఉపేందర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా చూడాలని బలంగా కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, వేడుకున్నానని తెలిపారు. ఉదయ్ ఫ్లెక్సీతో ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.