ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా సారధి రోహిత్ శర్మ మరో అడుగు ముందుకేశాడు. అంతకుముందు నుంచి నాలుగో స్థానంలోనే ఉన్నప్పటికీ.. విరాట్ కోహ్లీకి అతనికి మధ్య పాయింట్ల తేడా ఉండేది. కానీ ఇంగ్లండ్‌తో వన్డే తర్వాత ఆ తేడా కేవలం ఒక్క పాయింటుకు తగ్గింది. రోహిత్ శర్మ ప్రస్తుతం 802 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. 803 పాయింట్లతో కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు.
పాకిస్తాన్ సారధి బాబర్ ఆజమ్ (892 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. అదే జట్టుకు చెందిన ఇమామ్ ఉల్ హక్ (815 పాయింట్లు) రెండో స్థానంలో ఉన్నాడు. అదే సమయంలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో కెరీర్ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అతను ఐదు స్థానాలు మెరుగై వన్డే బౌలర్ల ర్యాకింగ్‌లో అగ్రస్థానంలో నిలిచాడు.
No bowler above him 🔝
Jasprit Bumrah stands as the No.1 ODI bowler in the latest @MRFWorldwide rankings!
— ICC (@ICC) July 13, 2022