Kohi – Rohit : భారత దిగ్గజాలు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma)లు ఆస్ట్రేలియా పర్యటనలో దంచేసేందుకు సిద్ధమవుతున్నారు. స్క్వాడ్‌తో కలిసి కంగారూ దేశం చేరుకున్న ఈ స్టార్ ఆటగాళ్లు గురువారం నెట్స్‌లో సాధన చేశారు. పెర్త్‌లో ఆదివారం తొలి వన్డే కోసంవిరాట్, హిట్‌మ్యాన్ పెద్ద షాట్లు ఆడుతూ చెమటోడ్చారు. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న ఇరువురు.. మునపటి తరహాలో ఆసీస్‌పై చెలరేగిపోవాలనే కసితో ఉన్నారు. ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్ తర్వాత రోకో టీమిండియా జెర్సీతో ఆడతున్న తొలి సిరీస్ ఇది. దాంతో, అంచనాలకు మించి రాణించి.. అభిమానులను అలరించేందుకు రెఢీ అవుతున్నారీ టాప్ గన్స్.
సుదీర్ఘ కాలం భారత జట్టుకు ఆటగాడిగా, నాయకుడిగా రోహిత్, విరాట్ విశేష సేవలందించారు. అయితే.. యువతరానికి అవకాశమిస్తూ ఒకరితర్వాత ఒకరు టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం వీరు కొనసాగుతున్న ఫార్మాట్ వన్డే మాత్రమే. వచ్చే వన్డే వరల్డ్ కప్‌లో ఆడాలనుకుంటున్న ఈ వెటరన్ బ్యాటర్లకు.. ఆస్ట్రేలియా సిరీస్ ఎంతో కీలకం కానుంది.
Just a couple of greats with almost 50,000 international runs between them, hitting the nets together 🎯 💪 pic.twitter.com/dLYTHPoHKu
— ESPNcricinfo (@ESPNcricinfo) October 16, 2025
మూడు వన్డేల్లో పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడింతే.. మరో సిరీస్‌కు ఎంపికయ్యే అవకాశాలున్నాయి. దాంతో, అనుభవజ్ఞులైన ఈ ఇద్దరూ తమ సత్తా చాటితే టీమిండియాకు తిరుగుండదని విశ్లేషకులు అంటున్నారు. ఆస్ట్రేలియాపై రోహిత్, కోహ్లీకు మెరుగైన రికార్డుంది. రోహిత్ 19 మ్యాచుల్లో.. 990 రన్స్ సాధించగా.. రన్ మెషీన్ విరాట్ 18 మ్యాచుల్లో 802 పరుగులు బాదాడు.
Fans running in, cameras out 📷
Virat Kohli hit the nets in Perth today 🍿 pic.twitter.com/zZ8AzbqXvI
— ESPNcricinfo (@ESPNcricinfo) October 16, 2025