ముంబై: టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్(KL Rahul).. హుటాహుటిన ఇంగ్లండ్ వెళ్లనున్నాడు. సోమవారం అతను ఇంగ్లండ్ వెళ్లేందుకు సిద్దం అవుతున్నాడు. జూన్‌లో ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు రెఢీ అవుతున్న సీనియర్ టీమిండియా క్రికెటర్.. ప్రిపరేషన్ కోసం ముందే వెళ్తున్నట్లు సమాచారం. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపు ఆడిన కేఎల్ రాహుల్.. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో టూరు చేస్తున్న ఇండియా ఏ జట్టు తరపున ఆడాలనుకుంటున్నాడు. సీనియర్ల టెస్టు సిరీస్ కు ఎంపికైన అతను.. ప్రాక్టీసు కోసం ముందే ఇంగ్లండ్‌కు వెళ్లాలనుకుంటున్నాడు. దీని కోసం అతను బీసీసీఐ నుంచి పర్మిషన్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇంగ్లండ్ లయన్స్‌తో ఇండియా ఏ జట్టు టెస్టు మ్యాచ్ ఆడనున్నది. మే 30వ తేదీ నుంచి క్యాంటర్ బరీలో తొలి టెస్టు జరగనున్నది అయితే ఆ మ్యాచ్‌ను రాహుల్ అందుకోలేడు. కానీ రెండవ మ్యాచ్‌లో ఆడేందుకు అనుమతి పొందిన కేఎల్ రాహుల్.. తొందరగా ఇంగ్లండ్ వెళ్లేందుకు రెఢీ అయ్యాడు. సోమవారం ఇంగ్లండ్‌కు రాహుల్ వెళ్తున్నాడని, ఇండియా ఏ తరపున రెండో అనధికార టెస్టులో ఆడనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
జూన్ 6వ తేదీన ఇండియా ఏ, ఇంగ్లండ్ లయన్స్ జట్ల మధ్య రెండో అన్అఫీషియల్ టెస్టు ప్రారంభంకానున్నది. ఇక సీనియర్ మెన్స్ క్రికెట్ జట్టు జూన్ 13వ తేదీన ప్రాక్టీసు మ్యాచ్ ఆడనున్నది. 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జూన్ 20వ తేదీ నుంచి లీడ్స్‌లో ప్రారంభంకానున్నది.