Headingley Test : లీడ్స్‌లోని హెడింగ్లేలో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్(100 నాటౌట్) సెంచరీతో విజృంభించాడు. లంచ్ తర్వాత స్పీడ్ పెంచిన రాహుల్.. షోయబ్ బషీర్ బౌలింగ్‌ల్ రెండు రన్స్ తీసి శతకం పూర్తి చేసుకున్నాడు. దాంతో, డ్రెస్సింగ్ రూమ్ బాల్కనీ నుంచి టీమిండియా కెప్టెన్ గిల్ సహ ఆటగాళ్లంతా చప్పట్లు కొడుతూ రాహుల్‌ను అభినందించారు. రాహుల్ సెంచరీ, పంత్ హాఫ్ సెంచరీలతో కదం తొక్కగా భారత్ స్కోర్ 240 దాటింది.
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసి స్వల్ప ఆధిక్యం సాధించిన టీమిండియా.. మ్యాచ్‌పై పట్టుబించింది. ఓవర్‌నైట్ స్కోర్ 90/2తో నాలుగో రోజు బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆదిలోనే శుభ్‌మన్ గిల్(8) వికెట్ కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న గిల్‌ను కార్సే బౌల్డ్ చేసి ఇంగ్లండ్‌కు బ్రేకిచ్చాడు. కానీ, ఆ తర్వాత వచ్చిన రిషభ్ పంత్( నాటౌట్) వచ్చిరాగానే బాదకుండా క్రీజులో కుదురుకోవడానికి ప్రాధాన్యమిచ్చాడు. అయితే అతడికి కార్సే ఓవర్లో లైఫ్ లభించింది. అనంతరం టంగ్ ఓవర్లో రాహుల్ స్లిప్‌లో కట్ షాట్ ఆడగా.. అక్కడే కాచుకొని ఉన్న హ్యారీ బ్రూక్ క్యాచ్ అందుకోలేకపోయాడు.
Look at KL Rahul’s control percentage 🤌 pic.twitter.com/JXxmtGzpgF
— ESPNcricinfo (@ESPNcricinfo) June 23, 2025
స్టోక్స్ టీమ్ ఎంత ప్రయత్నించినా సరే రాహుల్, పంత్ వికెట్ ఇవ్వలేదు. నింపాదిగా ఆడిన వీళ్లు జట్టు ఆధిక్యాన్ని పెంచుతూ పోయారు. లంచ్ తర్వాత గేర్ మార్చిన పంత్ అర్ద శతకం సాధించగా.. ఆ కాసేపటికే బషీర్ ఓవర్లో డబుల్స్ తీసి రాహుల్ సెంచరీ సంబురాలు చేసుకున్నాడు. స్టోక్స్ సేన బౌలింగ్ ఎత్తుల్ని చిత్తు చేస్తున్న ఈ ద్వయం ఇప్పటికే 152 పరుగుల భాగస్వామ్యంతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపింది. ప్రస్తుతం టీమిండియా 251 పరుగుల ఆధిక్యంలో ఉంది.