పెర్త్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో.. కేఎల్ రాహుల్(KL Rahul) ఔటైన తీరుపై వివాదం చెలరేగుతున్నది. ఆన్‌ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చినా.. డీఆర్ఎస్ విధానం రాహుల్‌కు కలిసి రాలేదు. ఏమీ చేయలేని స్థితిలో.. బలవంతంగా ఫీల్డ్ నుంచి రాహుల్ వెళ్లిపోయాడు. ఫస్ట్ సెషన్లో మెరుగ్గా బ్యాటింగ్ చేస్తున్న రాహుల్.. 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. అప్పటికే జైస్వాల్, పడిక్కల్, కోహ్లీలు పెవిలియన్ చేరుకున్నారు. రాహుల్ స్థిరపడుతున్నాడనుకున్న సమయంలో.. అనూహ్య రీతిలో థార్డ్ అంపైర్ ఔట్ ఇచ్చేశాడు.
మిచ్చెల్ స్టార్క్ బౌలింగ్‌లో.. ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ పట్టేశాడు. కీపర్ అలెక్స్ కేరీ ఆ క్యాచ్ అందుకున్నాడు. కానీ ఆన్ ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. ఆ సమయంలో ఆస్ట్రేలియా డీఆర్ఎస్ తీసుకున్నది. బ్యాట్, బాల్ మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపించింది. కానీ ఆ తర్వాత క్షణం.. స్నికో మీటర్లో స్పైక్ కనిపించింది. దీంతో థార్డ్ అంపైర్ ఔట్‌గా డిక్లేర్ చేశాడు. వాస్తవానికి బంతి ప్యాడ్‌కు తగిలింది.
పెవిలియన్‌కు వెనుదిరుగుతున్న రాహుల్.. థార్డ్ అంపైర్ నిర్ణయం పట్ల అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఆన్ ఫీల్డ్ అంపైర్‌తో తన వివాదం గురించి చర్చించాడు. బ్యాట్, బాల్ మధ్య గ్యాప్ ఉన్నట్లు బ్యాటర్ చెప్పినా.. థార్డ్ అంపైర్ ఆ విషయాన్ని పట్టించుకోలేదు.
మరో వైపు టెస్టుల్లో మూడు వేల పరుగుల మైలురాయిని కేఎల్ రాహుల్ దాటేశాడు. తాజా సమాచారం ప్రకారం 46 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఇండియా 121 రన్స్ చేసింది. పంత్ 37 రన్స్ చేసి ఔటయ్యాడు. నితీశ్ రెడ్డి 27 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నాడు.
No way this is given out, had to feel for KL Rahul.
pic.twitter.com/Ap8Ep4QSQD— All About Cricket (@allaboutcric_) November 22, 2024