హైదరాబాద్: అంతర్జాతీయ వన్ డే ఇంటర్నేషనల్ (ODI) క్రికెట్ మ్యాచ్‌లలో ఇండియన్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటివరకు 14 అంతర్జాతీయ వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడి 78.50 సగటు, 86 రన్ రేట్‌తో 628 పరుగులు చేసి టాప్ ప్లేస్‌లో నిలిచాడు. కేవలం 13 ఇన్నింగ్స్‌లో ఒక సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలు చేశాడు. అత్యుత్తమ స్కోర్ 111 పరుగులు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కేఎల్ రాహుల్ ఆడిన ఐదు అద్భుత ఇన్నింగ్స్ గురించి తెలుసుకుందాం..
ఆసియాకప్‌లో పాకిస్థాన్‌పై 111 నాటౌట్
రాహుల్ గాయంతో కొన్నాళ్లు ఆటకు దూరమైన తర్వాత తిరిగొచ్చి ఆడిన మొదటి మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్‌లో 106 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, రెండు సిక్సర్లతో రాహుల్ 111 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది.
వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాపై 97 నాటౌట్
వన్ డే ప్రపంచకప్-2023లో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో ఆడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 199 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 200 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోర్ 2 పరుగుల వద్ద ఉండగానే మూడు వికెట్లు పడ్డాయి. క్లిష్ట సమయంలో క్రీజులు అడుగుపెట్టిన కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడుతూ విరాట్ కోహ్లీతో కలిసి 165 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించడంలో ప్రధానపాత్ర పోషించాడు. రాహుల్ 115 బంతులను ఎదుర్కొని 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో 97 పరుగులు చేశాడు.
ఆస్ట్రేలియాతో వన్ డే సిరీస్‌లో 75 నాటౌట్
ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్ డే సిరీస్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో 189 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ తడబడింది. జట్టు స్కోర్ కేవలం 83 పరుగులకు చేరేసరికే 5 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన రాహుల్ 91 బంతులను ఎదుర్కొని ఒక సిక్సర్, ఏడు ఫోర్లతో 91 పరుగులు చేసి భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
శ్రీలంకతో వన్ డే సిరీస్‌లో 64 నాటౌట్
ఈ ఏడాది శ్రీలంకతో జరిగిన వన్ డే సిరీస్‌లో కూడా 216 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 83 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ నిలకడగా ఆడి జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించాడు. మొత్తం 103 బంతులను ఎదుర్కొని 6 ఫోర్లతో 64 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌లతో మంచి భాగస్వామ్యాలు నమోదు చేశాడు.
ఆసియాకప్‌లో శ్రీలంకపై 39 పరుగులు