భారీ స్కోరును ఛేదించి బెంగళూరును మట్టి కరిపించిన పంజాబ్ కింగ్స్.. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోలేక అదే బెంగళూరు చేతిలో ఓటమి పాలైన కోల్కతా నైట్ రైడర్స్ తలపడేందుకు సిద్ధమయ్యాయి. వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో టాస్ శ్రేయాస్ అయ్యర్నే వరించింది. మరో ఆలోచన లేకుండా బౌలింగ్ చేస్తామని అయ్యర్ చెప్పేశాడు.
ఈ ఐపీఎల్లో మంచు ప్రభావం తీవ్రంగా ఉండటంతో టాస్ గెలిచిన ప్రతి జట్టు బౌలింగ్ ఎంచుకోవడం గమనిస్తూనే ఉన్నాం. కోల్కతా జట్టులో షెల్డాన్ జాక్సన్ స్థానంలో శివమ్ మావి వస్తున్నట్లు అయ్యర్ తెలిపాడు. పంజాబ్లో సందీప్ శర్మ స్థానంలో రబాడ ఆడనున్నాడు.
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), భానుక రాజపక్స, లియామ్ లివింగ్స్టన్, రాజ్ బవా, షారుఖ్ ఖాన్, ఒడియన్ స్మిత్, హర్ప్రీత్ బ్రార్, అర్షదీప్ సింగ్, రాహుల్ చాహర్, కగిసో రబాడ
కోల్కతా నైట్ రైడర్స్: వెంకటేశ్ అయ్యర్, అజింక్య రహానే, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, శామ్ బిల్లింగ్స్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి
A look at the Playing XI for #KKRvPBKS
Live – https://t.co/lO2arKbxgf #KKRvPBKS #TATAIPL pic.twitter.com/FrOuHdROAS
— IndianPremierLeague (@IPL) April 1, 2022
#KKR have won the toss and they will bowl first at the Wankhede.
Live – https://t.co/lO2arKbxgf #KKRvPBKS #TATAIPL pic.twitter.com/cbGB5lfT5s
— IndianPremierLeague (@IPL) April 1, 2022