కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అలాగే తమ జట్టులో మూడు మార్పులు జరిగినట్లు వెల్లడించాడు. కృనాల్ పాండ్యా, దుష్మంత చమీర, ఆయుష్ బదోనీ ఆడటం లేదని తెలిపాడు.
వారి స్థానాల్లో కె. గౌతమ్, ఎవిన్ లూయిస్, మనన్ వోహ్రా ఆడుతున్నట్లు వెల్లడించాడు. అలాగే గాయం కారణంగా టోర్నీకి దూరమైన కేకేఆర్ ఓపెనర్ అజింక్య రహానే స్థానంలో అభిజీత్ తోమర్ ఆడుతున్నట్లు కోల్‌కతా సారధి శ్రేయాస్ అయ్యర్ వెల్లడించాడు.
లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డీకాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, మనన్ వోహ్రా, మార్కస్ స్టొయినిస్, జేసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్, మొహ్సిన్ ఖాన్, ఆవేష్ ఖాన్, రవి బిష్ణోయి
కోల్‌కతా నైట్ రైడర్స్: వెంకటేశ్ అయ్యర్, అభిజీత్ తోమర్, నితీష్ రాణా, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శామ్ బిల్లింగ్స్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, వరుణ్ చక్రవర్తి
A look at the Playing XI for #KKRvLSG
Live – https://t.co/NbhFO1ozC7 #KKRvLSG #TATAIPL https://t.co/Q7CpYAMWx4 pic.twitter.com/UbRsaZzw2l
— IndianPremierLeague (@IPL) May 18, 2022