Nitish Rana : ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) కెప్టెన్ నితీశ్ రానా(Nitish Rana)కు మరో చాన్స్ వచ్చింది. కెప్టెన్‌గా తొలి సీజన్లోనే ఆకట్టుకున్న ఈ యంగ్‌స్టర్ నార్త్ జోన్(North Zone) సారథిగా ఎంపికయ్యాడు. త్వరలో ప్రారంభం కానున్న దేవ్‌ధర్ ట్రోఫీ(Deodhar Trophy )లో జట్టను నడిపించనున్నాడు. జూలై 24 నుంచి పుదుచ్చేరి వేదికగా దేవ్‌ధర్ ట్రోఫీ ఆరంభం కానుంది. ఈ టోర్నమెంట్లో ఆరు జట్లు పోటీ పడునున్నాయి. ప్పటికే నార్త్ జోన్ 15 మందితో కూడిన బృందాన్ని ప్రకటించింది. ఆ 15 మందిలో అభిషేక్ శర్మ(Abhishek Sharma), ప్రభ్సిమ్రాన్ సింగ్(PrabhSimran Singh), హర్షిత్ రానా(Harshit Rana) ఉన్నారు. ఈ ముగ్గురు కూడా ఆసియా కప్ స్క్వాడ్‌కి ఎంపిక కావడం విశేషం.
ఐపీఎల్ 16వ సీజన్‌కు ముందు రెగ్యులర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer)కు వెన్నెముక గాయం తిరగబెట్టింది. దాంతో అతను సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఆ సమయంలో దేశవాళీలో ఢిల్లీ జట్టును నడిపించిన నితీశ్ రానాకు ఫ్రాంచైజీ సారథ్య బాధ్యతలు అప్పిగించింది. యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఈ యంగ్‌స్టర్ నిలబెట్టుకున్నాడు. కెప్టెన్‌గా కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ జట్టు సభ్యుల్లో స్ఫూర్తిని నింపాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ 14 మ్యాచుల్లో 413 రన్స్ కొట్టాడు.
రింకూ సింగ్, నితీశ్ రానా
మరోవైపు.. సిక్సర్ల వీరుడు రింకూ సింగ్(474 పరుగులు) విధ్వంసక బ్యాటింగ్ కూడా కోల్‌కతాకు కలిసొచ్చింది. అంతేకాదు ఈ సీజన్లో ఆరంగేట్రం చేసిన యువ స్పిన్నర్ సుయాశ్ శర్మ అంచనాలకు మించి రాణించాడు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వికెట్ల వేట కొనసాగించాడు. కానీ, కీలక మ్యాచుల్లో స్టార్ ఆటగాళ్లు విఫలం కావడంతో రెండుసార్లు చాంపియన్ అయిన కోల్‌కతా ప్లే ఆఫ్స్‌కు చేరలేకపోయింది. ఐపీఎల్లో నిలకడగా రాణిస్తున్న నితీశ్ 2021లో జాతీయ జట్టులోకి వచ్చాడు. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో ఆడాడు.