Kiran More | ఫిట్ నెస్ ఉన్నంత వరకు రోహిత్, కోహ్లీ ఆడాలి : కిరణ్ మోరే
Kiran More | ఇండియన్ క్రికెట్ లెజెండ్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ ఫామ్, ఫిట్నెస్ నిలబెట్టుకున్నంత కాలం అంతర్జాతీయ క్రికెట్లో ఆడాలని మాజీ భారత మాజీ క్రికెటర్, చీఫ్ సెలెక్టర్ కిరణ్ మోర్ ఆకాంక్షించారు.
హైదరాబాద్ : ఇండియన్ క్రికెట్ లెజెండ్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ ఫామ్, ఫిట్నెస్ నిలబెట్టుకున్నంత కాలం అంతర్జాతీయ క్రికెట్లో ఆడాలని మాజీ భారత మాజీ క్రికెటర్, చీఫ్ సెలెక్టర్ కిరణ్ మోర్ ఆకాంక్షించారు. వారిద్దరిని బలవంతంగా రిటైర్ చేయించే ఆలోచన సరైంది కాదన్నారు. పరుగులు చేస్తున్నంత కాలం వారిని కొనసాగిండచం ఉత్తమం అని పేర్కొన్నారు. గాజియాబాద్‌లో జరుగుతున్న ‘బియాండ్ రీచ్ ప్రీమియర్ లీగ్’ (BRPL) ట్రయల్స్ సందర్భంగా కిరణ్ మోరే మీడియాతో మాట్లాడారు. రోకోకు ఇప్పటికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని గుర్తు చేశారు. వీరిద్దరూ కలసి ఆడటం చూడటానికి ఎంతో బాగుంటుందని చెప్పారు.
వీరి రిటైర్మెంట్ పై ఎలాంటి చర్చలు చేయొద్దని సూచించారు. సచిన్ పదవీ విరమణ చేసినప్పుడు నా కళ్లలో నీళ్లు వచ్చాయి. ఈ ఇద్దరూ ఆట నుండి వైదొలిగినప్పుడు కూడా,వారి లోటు తీవ్రంగా బాధిస్తుందన్నారు. ఆ సమయం వచ్చినప్పుడు రిటైర్మెంట్ నిర్ణయాన్ని తీసుకొనే సమర్ధత వారికుందన్నారు. భవిష్యత్‌లో వైభవ్ సూర్యవంశీతో భారత్ గొప్ప కీర్తి లభిస్తుందన్నారు.
కాగా, 311 వన్డే మ్యాచ్లలోవిరాట్ 299 ఇన్నింగ్స్‌లలో 58.71 సగటుతో 14,797 పరుగులు సాధించాడు. ఇందులో 54 శతకాలు, 77 అర్ధశతకాలు ఉన్నాయి, అలాగే అతని అత్యధిక స్కోరు 183. గతేడాది13 వన్డేలలో 65.10 సగటుతో 651 పరుగులు సాధించి, మూడు శతకాలు, నాలుగు అర్ధశతకాలు నమోదు చేశాడు. 2026లో, అతను మూడు ఇన్నింగ్స్‌లలో 80.00 సగటుతో, 105కి పైగా స్ట్రైక్ రేట్‌తో 240 పరుగులు చేశాడు.
మరోవైపు ఐపీఎల్లో కోహ్లీ తన ఆటతీరును అద్భుతమైన స్థాయికి మెరుగుపరుచుకుంటూనే ఉన్నాడు. ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరుకున్న RCB తరపున ఆడుతూ 13 ఇన్నింగ్స్‌లలో 54.20 సగటుతో మొత్తం 542 పరుగులు సాధించాడు. ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలతో పాటు తన కెరీర్లోనే అత్యధికమైన 164.74 స్ట్రైక్ రేట్‌ను నమోదు చేసి, ‘ఆరెంజ్ క్యాప్’ రేసులో కొనసాగుతున్నాడు. రోహిత్ 282 వన్డేలలో 274 ఇన్నింగ్స్‌లలో 48.84 సగటుతో మొత్తం 11,577 పరుగులు సాధించాడు. ఇందులో 33 శతకాలు, 61 అర్ధశతకాలు ఉన్నాయి. 264 అత్యధిక వ్యక్తిగత స్కోర్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- cricket
- Kiran More
- Kohl
- odi
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

