భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించాడు. స్పెయిన్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ క్వార్టర్ ఫైనల్స్‌లో సునాయాస విజయంతో సెమీస్‌కు దూసుకెళ్లాడు. దీంతో ఈ టోర్నీలో భారత్‌కు తొలి పతకం ఖాయమైంది. శుక్రవారం నాడు జరిగిన క్వార్టర్ ఫైనల్లో డచ్ క్రీడాకారుడు మార్క్ కాలిజోపై శ్రీకాంత్ విజయం సాధించాడు.
కేవలం 26 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ 21-8, 21-7తో వరుస సెట్లతో గెలిచాడు. వరల్డ్ ఛాంపియన్షిప్స్ వేదికపై శ్రీకాంత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. ఇదే వేదికపై పురుషుల సింగిల్స్‌లో భారత్ సాధించిన 11వ పతకం ఇది.
కాగా, ఇదే టోర్నీలో మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగిన పీవీ సింధు.. క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయి ఇంటి ముఖం పట్టింది. చైనీస్ తైపీకి చెందిన టై జు యింగ్ చేతిలో 21-17, 21-13తో సింధు ఓటమిపాలైంది.
HISTORY SCRIPTED 🤩💥
— BAI Media (@BAI_Media) December 17, 2021
Cake walk for @srikidambi as he comfortably defeated 🇳🇱's Mark Caljouw 21-8, 21-7 in the QF to storm into the semis and ensures his first & 🇮🇳's 11th medal at #WorldChampionships 🔥#BWFWorldChampionships2021#IndiaontheRise#Badminton pic.twitter.com/Tnu5HRwJ8I