Kho Kho World Cup | ఢిల్లీ: వచ్చే ఏడాది భారత్ వేదికగా ‘ఖో ఖో ప్రపంచకప్’ను నిర్వహించనున్నట్టు భారత ఖో ఖో సమాఖ్య (కేకేఎఫ్ఐ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ టోర్నీలో ఆరు ఖండాల నుంచి 16 పురుషుల, 24 మహిళల జట్లు పాల్గొననున్నాయి. ‘2032 ఒలింపిక్స్లో ఖో ఖో ను క్రీడాంశంగా చేర్చే దిశగా ఈ ప్రపంచకప్ ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని కేకేఎఫ్ అధ్యక్షుడు సుధాన్షు మిట్టల్ తెలిపాడు.
పల్లె ప్రతిభను ప్రోత్సహించేలా
హైదరాబాద్, ఆట ప్రతినిధి: పల్లెల్లో దాగున్న ప్రతిభను ప్రోత్సహించేలా సీఎం కప్-2024 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా దాదాపు రెండు నెలల పాటు గ్రామీణ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడాపోటీల నిర్వహణకు సమాయత్తమైంది. ఇందులో భాగంగా బుధవారం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి పలు అంశాలపై మాట్లాడుతూ ‘గ్రామీణ యువతలో దాగున్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు సీఎం కప్ నిర్వహిస్తున్నాం. పల్లే క్రీడాకారులను ప్రపంచ చాంపియన్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకెళుతున్నాం. గురువారం సీఎం కప్ టోర్నీ లోగో, మస్కట్ను రేవంత్రెడ్డి ఆవిష్కరిస్తారు’ అని అన్నారు.