Khelo India | న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరుగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌తో పాటు పారా గేమ్స్‌కు బీహార్ ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయాన్ని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఒలింపిక్స్ తరహాలో యూత్‌గేమ్స్ ముగిసిన 10-15 రోజుల్లో పారాగేమ్స్ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
గతేడాది పారా గేమ్స్‌కు బీహార్ వేదికైంది. దీనికి తోడు ఈ మధ్య కాలంలో బీహార్..పలు ప్రతిష్ఠాత్మక క్రీడా ఈవెంట్లను విజయవంతంగా నిర్వహిస్తున్నది. రాజ్‌గిర్ వేదికగా తాజాగా ముగిసిన ఏషియన్ హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత మహిళల జట్టు విజేతగా నిలిచింది. ప్రధాన స్పోర్ట్స్ ఈవెంట్లను నిర్వహించడంలో ఈ మధ్య కాలంలో బీహార్ కీలకంగా వ్యవహరిస్తుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా అన్నారు.